• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించిన ప్రధాని

sastra_admin by sastra_admin
April 12, 2023
in న్యూస్
0 0
0
రాజస్థాన్‌లో-తొలి-వందేభారత్-ఎక్స్‌ప్రెస్,-వీడియో-కాన్ఫరెన్స్‌లో-ప్రారంభించిన-ప్రధాని

Vande Bharat Express:

అజ్మేర్-ఢిల్లీ వందేభారత్..

ప్రధాని నరేంద్ర మోదీ మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. రాజస్థాన్‌లో తొలి వందేభారత్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ట్రైన్ సర్వీస్‌లు అందించనుంది.  రేపటి నుంచి (ఏప్రిల్ 13) ఈ సర్వీస్ మొదలు కానుంది. అజ్మేర్- ఢిల్లీ మధ్యలో నడవనున్న ఈ ఎక్స్‌ప్రెస్ జైపూర్, అల్వార్, గుడ్‌గావ్ వద్ద ఆగుతుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ దూరం కవర్ చేసేందుకు కనీసంర 6 గంటల 15 నిముషాలు పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ ప్రయాణ సమయం గంట మేర తగ్గనుంది. ప్రపంచంలోనే తొలి సెమీహైస్పీడ్ ప్యాసింజర్ ట్రైన్‌ ఇదే. పర్యాటక ప్రాంతాలపైన రాజస్థాన్, పుష్కర్, అజ్మేర్ షరీఫ్ దర్గా ప్రాంతాలకు ఈ ట్రైన్ సర్వీస్‌లు నడవనున్నాయి. ఫలితంగా…ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ట్రైన్‌ అందుబాటులోకి రావడం వల్ల సామాజికంగానే కాకుండా ఆర్థికంగానూ అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందని కేంద్రం చెబుతోంది. ఇటీవలే ఏప్రిల్ 8న చెన్నై-కొయంబత్తూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించారు మోదీ. అదే రోజున తెలంగాణలోని సికింద్రాబ్‌-తిరుపతి మధ్య వందేభారత్‌కు పచ్చ జెండా ఊపారు. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ ట్రైన్…నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 660 కిలోమీటర్లు కవర్ చేయనుంది. 

Delhi | Rajasthan is getting its first Vande Bharat Express today from Ajmer to Delhi. The Vande Bharat train will boost the tourism industry in Rajasthan: PM Narendra Modi while the Vande Bharat Express flagging off event in Rajasthan via video conferencing pic.twitter.com/5eC5A31XaR

— ANI (@ANI) April 12, 2023

#WATCH | PM Narendra Modi flags off Ajmer-Delhi Cantt. Vande Bharat Express train pic.twitter.com/SvldsqAflF

— ANI (@ANI) April 12, 2023 వరుసగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను ప్రారంభిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలోనే హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ప్రస్తుతానికి తెలియకపోయినా…ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని బీజేపీ నేతలకు ఈ వివరాలు చెప్పినట్టు సమాచారం. గత వారం ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అప్పుడే బీజేపీ నేతలతో ఈ విషయం చెప్పారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే తెలంగాణకు మూడో వందేభారత్ ట్రైన్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్-బెంగళూరు ట్రైన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. అయితే..ఈ ఏడాది జనవరిలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని కాచిగూడ మధ్యలో సెమీ హైస్పీడ్ ట్రైన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. మరో నెలలో ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటకలో బీజేపీ నేతలు ఇప్పటికే దీనిపై ప్రచారం కూడా చేస్తున్నారు. త్వరలోనే వందేభారత్ ట్రైన్ వచ్చేస్తుందని చెబుతున్నారు. 

Also Read: Modi Surname Row: పట్నా కోర్టుకు రాహుల్ గాంధీ, పరువు నష్టం కేసు విచారణ

Tags: PM ModiRajasthan Vande BharatVande BharatVande Bharat Expressన్యూస్

Recent Posts

  • అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
  • కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?
  • Papedabba Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
  • మీపై, మీ కుటుంబంపై న‌ర‌దిష్టికి సంకేతాలు ఇవే
  • నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In