• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

ఖర్గేతో నితీష్ కుమార్ కీలక భేటీ, కలిసి పోటీ చేస్తామని ప్రకటన

sastra_admin by sastra_admin
April 12, 2023
in న్యూస్
0 0
0
ఖర్గేతో-నితీష్-కుమార్-కీలక-భేటీ,-కలిసి-పోటీ-చేస్తామని-ప్రకటన

Nitish Kumar Kharge Meet:

విపక్షాల ఐక్యత..

విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సమావేశం ముగిసిన తరవాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదో చరిత్రాత్మక భేటీ అని, ఎన్నో సమస్యలపై చర్చ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఒక్కటిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. 

“ఇవాళ చరిత్రాత్మక సమావేశం జరిగింది. చాలా సమస్యలు చర్చించాం. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం”

– మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

#WATCH | Today we had a historic meeting here and discussed many issues. We all have decided to unite all (opposition) parties and fight the upcoming elections unitedly: Congress President Mallikarjun Kharge pic.twitter.com/ds4ljcHsBZ

— ANI (@ANI) April 12, 2023

ఈ భేటీపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు. 

“వీలైనంత వరకూ అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. కలిసి కట్టుగా ముందుకెళ్లి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం”

– నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

#WATCH | “We will try to unite as many political parties as we can and move forward together,” says Bihar CM Nitish Kumar pic.twitter.com/Qfa5LRPxYU

— ANI (@ANI) April 12, 2023

ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం అంతా ఒక్కటిగా నిలబడతామని తెలిపారు. విపక్షాలను ఏకం చేసేందుకు ఇదో కీలక అడుగుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 

“ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు ఇదో కీలక అడుగుగా భావిస్తున్నాం. ప్రతిపక్షాల విజన్ ఏంటో త్వరలోనే వెల్లడిస్తాం. ఆ విజన్‌తోనే కలిసికట్టుగా ముందుకెళ్తాం. దేశం కోసం నిలబడతాం”

– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

#WATCH | This is a historic step to unite the opposition. We will develop the vision of the opposition parties and move forward; we will all stand together for the country: Congress leader Rahul Gandhi pic.twitter.com/S5iEupslzL

— ANI (@ANI) April 12, 2023 స్టాలిన్‌తోనూ మైత్రి.. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. విపక్షాలు ఒకేతాటిపైకి రావడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న కాంగ్రెస్…క్రమంగా అన్ని పార్టీలతో మైత్రి పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే…కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కాల్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు రావాలని ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో ఓ సారి సమావేశం జరిగింది. ఈ సారి ఖర్గే ఆధ్వర్యంలో భేటీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎమ్‌కేతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలోనూ ఇదే విధంగా కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. Also Read: Delhi Liquor Scam: విచారణలో ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు- ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్ ఆరోపణ

Tags: Mallikarjun KhargeNitish KumarNitish Kumar Kharge Meetrahul gandhiTejashwi Yadavన్యూస్

Recent Posts

  • అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
  • కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?
  • Papedabba Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
  • మీపై, మీ కుటుంబంపై న‌ర‌దిష్టికి సంకేతాలు ఇవే
  • నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In