• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home తెలంగాణ

తెలంగాణ డీజీపీని ఏపీకి పంపే వ్యూహమా ? ఆ కేసును త్వరగా తేల్చాలని హైకోర్టులో కేంద్రం పిటిషన్ !

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in తెలంగాణ
0 0
0
తెలంగాణ-డీజీపీని-ఏపీకి-పంపే-వ్యూహమా-?-ఆ-కేసును-త్వరగా-తేల్చాలని-హైకోర్టులో-కేంద్రం-పిటిషన్-!

Telangana News :   తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారణ చేయాలని కోరింది. అయితే హైకోర్టు జూన్ 5 న విచారిస్తామని తెలిపింది.  రాష్ట్ర విభజన తర్వాత 14 మంది  IAS , IPS అధికారులను AP, తెలంగాణకు కేటాయించింది కేంద్రం.  కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించిన కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులు తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో  క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం.  ఇప్పటికే హైకోర్టు అదేశాలతో  ఐఏఎస్  అధికారి సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లారు. సీఎస్ పోస్టులో ఉన్న ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి రావడంతో చివరికి వీఆర్ఎస్ తీసుకున్నారు.  ఏపీ క్యాడర్‌‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్‌ కుమార్ మొన్నటిదాకా తెలంగాణ సీఎస్ గా పని చేశారు. అయితే క్యాడర్ విషయంలో వారం కిందట హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు. కానీ అక్కడ పోస్టింగ్ కేటాయించలేదు. విధుల్లో చేరకుండానే పదవి విరమణ తీసుకున్నారు.               

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు కొన్నాళ్ల కిందట వాయిదా వేసింది.  12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది.  ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని  అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించారు.  

ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు డీజీపీపై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కుట్రలతో తమను కేసుల్లో ఇరిక్సుతన్నారని బండి సంజయ్ ఆరోపించారు. డీజీపీని ఏపీ క్యాడర్ కు పంపిస్తామన్న ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు  అనూహ్యంగా  కేంద్ర ప్రభుత్వం నుంచి కేసులను త్వరగా తేల్చాలని కేంద్రం హైకోర్టును ఆశ్రయించడంతో అధికారవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది. అయితే విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు చెప్పడంతో మరో రెండు నెలల వరకూ ఈ అంశంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు.  

Tags: Cadre Dispute of Civil Service OfficersTelangana DGP Anjani KumarTelangana Newsతెలంగాణ

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In