• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఐపీఎల్

ధోనీ హెలికాప్టర్‌ షాట్లు – లాస్ట్‌ బాల్‌కు CSKపై RR థ్రిల్లింగ్‌ విన్‌!

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in ఐపీఎల్
0 0
0
ధోనీ-హెలికాప్టర్‌-షాట్లు-–-లాస్ట్‌-బాల్‌కు-cskపై-rr-థ్రిల్లింగ్‌-విన్‌!

IPL 2023, CSK vs RR: 

చెపాక్‌లో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 పరుగుల తేడాతో అమేజింగ్‌ విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్‌ కాన్వే (50; 38 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఎంఎస్‌ ధోనీ (32*; 17 బంతుల్లో 1×4, 3×6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1×4, 2×6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52; 36 బంతుల్లో 1×4, 3×6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (38; 26 బంతుల్లో 5×4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1×4, 2×6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (30*; 10 బంతుల్లో 1×4, 2×6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు.

ధోనీ మ్యాజిక్‌!

ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్‌ స్టార్ట్‌ రాలేదు. సందీప్‌ శర్మ వేసిన 2.2వ బంతికే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో అజింక్య రహానె (31; 19 బంతుల్లో 2×4, 1×6) అండతో మరో ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే నిలబడ్డాడు. వీరిద్దరూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి సీఎస్కే 45/1తో నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచి రెండో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు. రన్‌రేట్‌ పెరగకుండా అడ్డుకున్న ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద రహానెను ఎల్బీ చేయడం ద్వారా అశ్విన్‌ విడదీశాడు. ఆ తర్వాత శివమ్‌ దూబె (8), మొయిన్‌ అలీ (7), అంబటి రాయుడు (1) వెంటవెంటనే ఔటవ్వడంతో మెరుగైన భాగస్వామ్యాలు రాలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కాన్వే 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అతడిని చాహల్‌ ఔట్‌ చేశాడు. దాంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 40గా మారింది. ధోనీ అండతో 19వ ఓవర్లో జడేజారెండు సిక్సులు, ఒక బౌండరీ బాది 19 రన్స్‌ అందించాడు. ఆఖరి ఓవర్లో 21 రన్స్‌ అవసరం కాగా.. సందీప్‌ శర్మ 17 రన్సే ఇచ్చాడు. అయితే మహీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి రాయల్స్‌ను భయపెట్టాడు. ఆఖరి బంతికి 5 రన్స్‌ అవసరం ఉండగా సింగిల్‌ మాత్రమే తీశాడు. 

రాజస్థాన్ జోష్‌!

తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (10) ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ (38) తెలివిగా బ్యాటింగ్ చేశాడు. బట్లర్‌తో కలిసి బౌండరీలు బాదాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాయల్స్‌ 57/1తో నిలిచింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 41 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్‌ ఆడిన పడిక్కల్‌… రవీంద్ర జడేజా వేసిన 8.3వ బంతికి ఔటయ్యాడు. మరో రెండో బంతులకే కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 88.

వికెట్లు పడుతున్నా రాయల్స్‌ దూకుడు తగ్గించలేదు. అశ్విన్‌, బట్లర్‌ కలిసి నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. సీఎస్కే బౌలర్లపై యాష్‌ ఎదురుదాడి చేశాడు. కీలక సమయంలో అతడిని ఆకాశ్ సింగ్‌ ఔట్‌ చేశాడు. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందున్న బట్లర్‌ను మొయిన్‌ అలీ పెవిలియన్‌ పంపించాడు. అయితే ఆఖర్లో విండీస్‌ వీరుడు హెట్‌మైయిర్‌ మంచి హిట్టింగ్‌తో స్కోరును 175/8కి చేర్చాడు.

Tags: Chennai Super KingschepaukCSK vs RRIPL 2023MS DhoniRajasthan RoyalsSanju Samsonఐపీఎల్

Recent Posts

  • ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు – పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని
  • TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు!
  • ప్చ్‌.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్‌! అజింక్య సెంచరీ మిస్‌ – ఆసీస్‌కు భారీ లీడ్‌!
  • ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం – కేసీఆర్
  • పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది – విడుదల ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In