ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
మంత్రి హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు కారుమూరి. హరీష్ రావు టైం చూసుకొని ఏపీ వచ్చే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే ఇళ్లపైకి నీళ్లు వస్తాయని ఎద్దేవా చేశారు.