• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

అమృత్ పాల్ ఆచూకీ చెప్పండి, నజరానా పట్టుకెళ్లండి – ప్రజలకు పోలీసుల ఆఫర్

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in న్యూస్
0 0
0
అమృత్-పాల్-ఆచూకీ-చెప్పండి,-నజరానా-పట్టుకెళ్లండి-–-ప్రజలకు-పోలీసుల-ఆఫర్

Amritpal Singh Poster:

అమృత్ పాల్  పోస్టర్లు

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ పరారై 26 రోజులవుతోంది. ఇప్పటికీ ఆచూకీ దొరక్కుండా తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో వీడియోలు రిలీజ్ చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నాడు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడ ఉన్నాడన్నది తెలియడం లేదు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అతడిని పట్టుకోవడం వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే…ప్రజల సహకారమూ కోరుతున్నారు. అమృత్‌ పాల్‌ను పట్టుకునేందుకు సాయపడండి అంటూ పంజాబ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. బటాలా రైల్వే స్టేషన్‌లో అమృత్ పాల్ పోస్టర్లు అంటించారు. “మోస్ట్ వాంటెడ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాం. అతడికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పండి. ఇలా సాయం చేసిన వారికి తగిన రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఈ వివరాలు చెప్పిన వాళ్ల పేరు కూడా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతామని వెల్లడించారు. ప్రస్తుతానికి అమృత్ పాల్ సింగ్ అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మార్చి 18న పరారయ్యాడు తనంతట తానుగానే వచ్చి లొంగిపోతాడన్న వాదనలూ వినిపించాయి. కానీ…అదేమీ జరగడం లేదు. “నన్ను పట్టుకోవాలంటే నేరుగా మా ఇంటికే రావచ్చుగా” అంటూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు అమృత్ పాల్. ఇది పంజాబ్ పోలీసులకు మరింత ఆగ్రహం కలిగించింది. 

సన్నిహితుడి అరెస్ట్..

ఇటీవలే అమృత్‌కు అత్యంత సన్నిహితుడైన  పపల్ ప్రీత్‌ సింగ్‌ (Papalpreet Singh Arrest)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హోషియార్‌పూర్‌లో పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో కలిసి  జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్, పపల్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరూ కలిసే తిరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే..హోషియార్‌పూర్‌లో మాత్రం ఎవరికి వాళ్లు వేరు వేరు దారుల్లో వెళ్లినట్టు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు పపల్ ప్రీత్‌ను అరెస్ట్ చేశారు. అమృత్‌ పాల్‌కి రైట్‌ హ్యాండ్‌ అయిన పపల్ ప్రీత్‌ అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే..PapeeDabba News సోర్సెస్ ప్రకారం..పపల్‌ ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. “అమృత్ పాల్ సింగ్ ఇలా తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడు. అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తరవాతే పోలీసులకు వీడియో పంపాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడు” అని పపల్ ప్రీత్ తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం.

నేపాల్‌కు వెళ్లాడా..? 

భారత్ లో పరారీలో ఉన్న అమృత్ పాల్ కోసం దర్యాప్తు సంస్థలు, భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నేపాల్ కు పారిపోయి ఉండొచ్చనన్ అనుమానాల మధ్య భారత్ అభ్యర్థన మేరకు నేపాల్ అధికారులూ అమృత్ పాల్ సింగ్ కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయమే నేపాల్ ప్రభుత్వానికి భారత రాయబార కార్యాలయం లేఖ రాసింది. అమృత పాల్ సింగ్ నేపాల్ లో దాక్కుని ఉండొచ్చని లేదంటే నేపాల్ నుంచి ఇతర దేశాలకు పారిపోయి ఉండొచ్చని తెలిపారు. ఇందుకోసం నేపాల్ రాయబార కార్యాలయం నేపాల్ భద్రతా సిబ్బందికి అమృత్ పాల్ కు చెందిన విభిన్న ఫోటోలు కూడా పంపించారు. 

Also Read: Nitish Kumar Kharge Meet: ఖర్గేతో నితీష్ కుమార్ కీలక భేటీ, కలిసి పోటీ చేస్తామని ప్రకటన

Tags: Amritpal Singh PosterAmritpal Singh Rewardpunjabpunjab policeన్యూస్

Recent Posts

  • పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది – విడుదల ఎప్పుడంటే?
  • డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
  • 9 నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణం పరుగులు – మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !
  • ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు
  • కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్మకాలు – అది తిన్నవారిలో ఒకటే ఆందోళన!

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In