For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 14:55 [IST]
Twitter: అనేక వివాదాల నడుమ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. అనేక ట్విస్టుల తర్వాత భారీ మెుత్తం చెల్లించి కంపెనీని సొంతం చేసుకున్న మస్క్ ఆ తర్వాత కంపెనీలో భారీ మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులను ఆయన తొలగించారు. అసలు కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చిందా అన్నట్లు ఆఫీసులకు అద్దె కూడా చెల్లించలేదు.
ఇక్కడి వరకు ట్విట్టర్ కథ ఒకలా ఉంటే.. తాజాగా కంపెనీని ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో ట్విట్టర్ ను కలిపేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ట్విట్టర్ ప్రత్యేక కంపెనీగా ఉంది.. అయితే ఇకపై ఇది స్వతంత్ర కంపెనీ కాదని కోర్టుకు అందించిన సమాచారంలో మస్క్ పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన సంకేతాలను మస్క్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇప్పటికే ఇచ్చారు.
ఎలాన్ మస్క్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎక్స్ ప్రణాళికను గతంలోనే ప్రకటించారు. చైనాకు చెందిన WeChat మాదిరిగా మెసేజింగ్, కాలింగ్, పేమెంట్స్ వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావటమే ఎలాన్ మస్క్ లక్ష్యంగా తెలుస్తోంది. దీనికి ముందు 1999లోనే ఎక్స్ పేరుతో ఓ ఆన్లైన్ బ్యాంకును ఏర్పాటు చేసి ఆ తర్వాత దానిని పేపాల్ లో విలీనం చేశారు.
X
— Elon Musk (@elonmusk) April 11, 2023 BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విట్టర్‌ను నడుపుతున్న అనుభవం గురించి మాట్లాడారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు విక్రయించటానికి తాను సిద్ధంగా లేనని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి ఎదుర్కొన్న సవాళ్లపై స్పందిస్తూ ట్విట్టర్లో తాను గడిపిన సమయాన్ని “చాలా బాధాకరమైనది”, “రోలర్‌కోస్టర్” అని ఎలాన్ మస్క్ తెలిపారు.
English summary
Twitter soon to be merged into X corp everything app, Know details
Twitter soon to be merged into X corp everything app, Know details
Story first published: Wednesday, April 12, 2023, 14:55 [IST]