• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఎడ్యుకేషన్

ప్ర‌శాంతంగా ముగిసిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు, పరీక్షలకు 99.63 శాతం మంది హాజరు!

sastra_admin by sastra_admin
April 11, 2023
in ఎడ్యుకేషన్
0 0
0
ప్ర‌శాంతంగా-ముగిసిన-ప‌దో-త‌ర‌గ‌తి-ప‌రీక్ష‌లు,-పరీక్షలకు-99.63-శాతం-మంది-హాజరు!

తెలంగాణలో ప‌దోత‌ర‌గ‌తి ప్రధాన ప‌రీక్ష‌లు ఏప్రిల్ 12తో ముగిశాయి. తెలుగు పేపర్, హిందీ పేపర్ లీకేజీ వ్యవహారాలు మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏప్రిల్ 3న ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 12న సోష‌ల్ స్ట‌డీస్ ప‌రీక్ష‌తో ప‌ది ప‌రీక్ష‌లు ముగిశాయి. టెన్త్ ఎగ్జామ్స్‌కు 99.63 శాతం మంది విద్యార్థులు హాజ‌రైన‌ట్లు ఎస్ఎస్‌సీ బోర్డు ప్ర‌క‌టించింది. ఇక ఓరియంటల్ పేపర్-2 పరీక్షలు ఏప్రిల్ 13తో ముగియనున్నాయి.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు. 1,809 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేదు. ప్ర‌యివేటు విద్యార్థులు 443 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు మూడు న‌మోదు అయ్యాయి. ప‌ది ప‌రీక్ష‌ల‌ను 2,652 సెంట‌ర్ల‌లో నిర్వ‌హించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లను నిర్వ‌హించారు.

Also Read:

ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి – పరీక్ష ఎప్పుడంటే?ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం ‘ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్‌ 8న, రెండో జాబితాను జూన్‌ 16న, మూడో జాబితాను జూన్‌ 23న ప్రకటించనున్నారు. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీఆర్‌డీసీ సెట్-2023 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష – 2023కు ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్‌ 8న ప్రకటిస్తారు. అనంతరం సీట్ల భర్తీ కోసం తొలి విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 15న, రెండో విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 22న, మూడో విడత కౌన్సెలింగ్‌ జూన్ 28న నిర్వహిస్తారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Tags: 10th class examsEducation News in TeluguSSC ExamsTelangana Tenth ExamsTS SSC Examsఎడ్యుకేషన్

Recent Posts

  • ఎట్టకేలకు విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ మూవీ సిద్ధం – ట్రైలర్ డేట్ ఫిక్స్
  • మొన్న
  • క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు
  • Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!
  • పొమన్నలేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబు అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In