For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 11:49 [IST]
LIC-Adani: దేశంలో చాలా మంది సామాన్య ప్రజలు తమ డబ్బును ఎల్ఐసీ పాలసీల్లో దాచుకుంటుంటారు. ఎల్ఐసీ అంటే నమ్మకం. అయితే అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన తర్వాత కూడా తన పెట్టుబడులను పెంచుకుంటూ పోవటంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనిని ప్రతిపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి.
ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023లో జనవరి-మార్చి త్రైమాసికంలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంది. హిండెన్‌బర్గ్ తన నివేదికను జనవరి 24, 2023న విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ తన పెట్టుబడులను పెంచటంపై దుమారం చెలరేగింది. పాలసీదారులకు చెందిన ప్రజల సొమ్మును అదానీకి మోదీ సర్కార్ ముట్టచెప్పిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రజల సొమ్ము సురక్షితంగా ఉందంటూ ఎల్ఐసీ ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మార్చి 2023లో అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో ఎల్ఐసీ మెుత్తంగా 4.26 శాతం వాటాను కలిగి ఉంది. అయితే జూన్ 2022లో ఇది 3.85 శాతంగా.. జూన్ 2021లో కేవలం 1.32 శాతంగా ఉంది. ఇదే క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ లో మార్చి 2023లో 6.02 శాతం వాటాలను ఎల్ఐసీ కలిగి ఉంది. డిసెంబర్ 2022లో ఇందులో 5.96 శాతం, డిసెంబర్ 2021లో 4.65 శాతం వాటాను కలిగి ఉంది.
The revelation that LIC’s holding in Adani Enterprises has increased while its stock value has fallen sharply once again strengthens the case for a JPC (Joint Parliamentary Committee) to investigate the PM-linked Adani MegaScam.
Here is my statement. pic.twitter.com/uE41OQbaLH
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 11, 2023 ఇక అదానీ ట్రాన్స్ మిషన్ కంపెనీలో తాజాగా మార్చి నాటికి ఎల్ఐసీ 3.68 శాతం వాటాలను కలిగి ఉంది. డిసెంబర్ 2020లో ఇది 2.42 శాతంగా ఉండగా.. 2022 డిసెంబర్ నాటికి 3.65 శాతంగా ఉంది. చివరగా అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీలో ఎల్ఐటీ తాజా వాటా 1.36 శాతంగా ఉంది. దీనికి ముందు డిసెంబర్ 2022లో వాటా 1.28 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో జాయింప్ పార్లమెంటరీ కమిటీ ప్రధాని మోదీకి, గుజరాత్ వ్యాపారి అదానీకి మధ్య సంబంధాలను అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ లేఖ రాశారు.
English summary
State Run Insurance Firm LIC increased its stake of investments in 4 Adani firms, Know details
State Run Insurance Firm LIC increased its stake of investments in 4 Adani firms, Know details
Story first published: Wednesday, April 12, 2023, 11:49 [IST]