For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 9:47 [IST]
Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా 8 రోజులుగా మార్కెట్లు లాభాల్లో ముగియటంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర పెరిగింది. ప్రస్తుతం సెన్సెక్స్ సూచీ 60 వేల మార్కును దాటగా.. నిఫ్టీ ఐటీ నష్టాల్లో కొనసాగుతోంది.
ఉదయం 9.24 గంటల సమయంలో మార్కెట్లు చాలా ఓలటైల్ గా ఉన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 48 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 30 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 39 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 66 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ ఫలితాలు మార్కెట్లకు మార్గనిర్ధేశంగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గడచిన 7 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీల్లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఆసియా మార్కెట్లు ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణం డేటాతో పాటు ఫెడ్ మినిట్స్ డేటా కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికి తోడు ఇండియా మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు విడుదల కానున్న తరుణంలో మార్కెట్లు స్తబ్ధుగా కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు.
దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ పైజెస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, టాటా కన్సల్టెన్సీ, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, యూపీఎల్, బ్రిటానియా, మారుతీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
English summary
Markets trading flat amid investors waiting for US inflation data, fed minutes, CPI inflation
Markets trading flat amid investors waiting for US inflation data, fed minutes, CPI inflation
Story first published: Wednesday, April 12, 2023, 9:47 [IST]