• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home క్రికెట్

పరాజితుల ప్రథమ పోరు – బోణీ కొట్టేదేవరో? ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై

sastra_admin by sastra_admin
April 11, 2023
in క్రికెట్
0 0
0
పరాజితుల-ప్రథమ-పోరు-–-బోణీ-కొట్టేదేవరో?-ఢిల్లీతో-మ్యాచ్‌లో-టాస్-గెలిచిన-ముంబై

DC vs MI, IPL 2023 Live: ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరానికి తెరలేవనుంది.  16వ ఎడిషన్ మొదలై   రెండు వారాలు కావస్తున్నా దాదాపు అన్ని జట్లూ రెండు మ్యాచ్‌లు ఆడినా  బోణీ కొట్టని   రెండు ఫ్రాంచైజీలు  నేడు ఢిల్లీ వేదికగా తలపడబోతున్నాయి.  ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదకగా ఢిల్లీ క్యాపిటల్స్  – ముంబై ఇండియన్స్  ఆడుతున్నాయి.  ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్  చేయనుంది.  ఈ సీజన్ లో  ఇంతవరకూ  బోణీ కొట్టని ఈ  ఇరు జట్లూ తొలిసారి ఆడబోతున్నాయి. మరి ఈ  పరాజితుల పోరులో బోణీ కొట్టేదెవరో..? 

టాస్ సందర్బంగా  రోహిత్ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్ లలో తాము  ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడామని, ఈ మ్యాచ్ లో మాత్రం మొదట బౌలింగ్ చేస్తామని  చెప్పాడు.  నేటి  పోరులో  కూడా ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడటం లేదు.  ఢిల్లీ  జట్టులో కూడా పలు మార్పులు జరిగాయి.  ముస్తాఫిజుర్  రెహ్మాన్  జట్టుతో చేరగా  గతేడాది అండర్ -19 వన్డే వరల్డ్ కప్ విన్నర్  యశ్ ధుల్ నేడు అరంగేట్రం చేయనున్నాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదు ట్రోఫీలు సాధించి లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్  ఈ సీజన్ లో  ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది.  బెంగళూరులో ఆర్సీబీ, ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణ పరాజయాల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని ఎంఐ  ఈ మ్యాచ్ లో అయినా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నది. 

 

🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @DelhiCapitals. Follow the match ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/ow1NTZ2Gsx

— IndianPremierLeague (@IPL) April 11, 2023

ముంబై వైఫల్యం..

బ్యాటింగ్‌లో  రోహిత్ శర్మ  చెన్నైతో మ్యాచ్ లో టచ్ లోకి వచ్చినట్టే కనిపించినా  కొద్దిసేపే క్రీజులో  మెరుపులు మెరిపించి ఔటయ్యాడు.   ఇషాన్ కిషన్, రూ. 17 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్, మిస్టర్ 360  సూర్యకుమార్ యాదవ్ లు దారుణంగా విఫలమవుతున్నారు.   ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ  బెంగళూరుతో మ్యాచ్‌లో రాణించినా  సీఎస్కేతో చేతులెత్తేశాడు. టిమ్ డేవిడ్ కూడా  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.   మరి నేటి మ్యాచ్ లో అయినా ముంబై బ్యాటింగ్ మెరుగ్గా ఆడుతుందో లేదో చూడాలి. బౌలింగ్‌లో అయితే  ముంబై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోతున్నారు.  

ఢిల్లీదీ అదే కథ.. 

ముంబై కంటే ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్పితే టాపార్డర్ బ్యాటర్లు పృథ్వీ  షా,  రిలీ రూసో లు  వరుస వైఫల్యాలతో విసుగు తెప్పిస్తున్నారు.  లక్నో,  గుజరాత్ తో పాటు  గత మ్యాచ్ రాజస్తాన్‌తో కూడా ఆ జట్టు ఎక్కువగా డేవిడ్ వార్నర్ మీదే ఆధారపడుతోంది.  రాజస్తాన్ తో పోరులో లలిత్ యాదవ్ కాస్త ఫర్వాలేదనిపించినా  మనీష్ పాండే  విఫమయ్యాడు.   అక్షర్ పటేల్  కాస్త బెటర్ గానే ఆడుతున్నా  కొత్త కుర్రాడు, వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ బెరుకు లేకుండానే ఆడుతున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలవడం లేదు.  మరి  నేటి మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మెరుగవుతుందా..?  

బౌలింగ్ లో కూడా  ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్  లు భారీగా పరుగులిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఈ ఇద్దరినీ పక్కనబెట్టింది.  ఢిల్లీ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కూడా గత రెండు మ్యాచ్ లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.   స్పిన్నర్ కుల్దీప్ యాదవ్  పరుగులు కట్టడి చేస్తున్నాడు. 

తుది జట్లు :  

ఢిల్లీ క్యాపిటల్స్ :  డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా,  మనీష్ పాండే,  యశ్ ధుల్, రొవ్మన్ పావెల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్,  కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అన్రిచ్  నోర్జే 

ముంబై ఇండియన్స్ :  రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహల్  వదేర, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రాండార్ఫ్, రిలీ మెరిడిత్

Tags: Arun Jaitley StadiumDavid WarnerDCDC vs MIDelhi CapitalsIndian Premier League 2023IPLIPL 2023IPL 2023 Match 16MIMumbai IndiansRohit Sharmaక్రికెట్

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In