For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 11:07 [IST]
Narayana Murthy: దేశంలోని యువ ఎంటర్ ప్రెన్యూర్స్, స్టార్టప్ వ్యవస్థాపకులతో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తన అనుభవాలను పంచుకుంటారు. దీనికి తోడు విద్యార్థులతో కూడా కలుస్తుంటారు. ఈ క్రమంలో వారికి కొన్ని చిట్కాలు, సూచనలు ఇస్తుంటారు.
కంపెనీల వ్యవస్థాపకులకు ఇటీవల NR నారాయణమూర్తి ఒక విలువైన సలహాను ఇచ్చారు. వ్యాపార ఆలోచనలో వైఫల్యాలను ప్రారంభంలోనే గుర్తించటం చాలా ముఖ్యమని అన్నారు. ఎల్లప్పుడూ ఒకే ఆలోచనకు అతుక్కుని ఉండకూడదని నొక్కి చెప్పారు.
స్నాప్‌డీల్ సహ-వ్యవస్థాపకుడు కునాల్ బహ్ల్‌తో మాట్లాడుతూ.. వ్యవస్థాపకులు తమ ఆలోచనలో “నిర్మాణ బలహీనత”ని కనుగొంటే.. ఆ ఆలోచనను వదులుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలని అన్నారు. అయితే దానిని ఎప్పుడు వదులుకోవాలి లేదా ఎలాంటి పరిస్థితుల్లో పోరాడాలనేది ఎలా నిర్ణయించుకోవాలని కునాల్ ప్రశ్నించారు.
దీనికి బదులిస్తూ నారాణయమూర్తి 1976లో సాఫ్ట్‌ట్రానిక్స్ అనే కంపెనీని స్థాపించిన సమయాన్ని గుర్తుచేసుకున్నారు. సాఫ్ట్‌ట్రానిక్స్‌లో తన వైఫల్యానికి కారణాలను, తొమ్మిది నెలల్లో దానిని ఎందుకు ముసేసిన కాలానికి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో ఐటీ సర్వీసెస్ మార్కెట్ లేదని తాను గుర్తించానని గ్రహించినట్లు మూర్తి తెలిపారు. చాలా తక్కువ మంది వద్ద, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కంప్యూటర్లు ఉండటం అందుకు కారణమని వెల్లడించారు.
English summary
Infosys Narayana Murthy Gives advice to new entrepreneurs, Know details
Infosys Narayana Murthy Gives advice to new entrepreneurs, Know details
Story first published: Wednesday, April 12, 2023, 11:07 [IST]