For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 9:26 [IST]
IMF: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం గుర్తించాయి. అయితే IMF తన తాజా అంచనాల్లో ఇండియా వృద్ధిరేటుని కొంతమేర తగ్గించింది. గతవారం RBI పెంచగా.. ఇప్పుడు IMF అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం విశేషం.
2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ GDP వృద్ధిని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 5.9 శాతానికి పరిమితం చేసిందన్నమాట. అయితే RBI అంచనాతో పోలిస్తే ఈ గణాంకాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రైవేట్ రంగంలోని నిపుణులు ఊహించిన దానికి అనుగుణంగానే ఉంది.
ఫిబ్రవరి 8న ద్రవ్య విధాన ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు. దాని ప్రకారం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని MPC ద్వారా వెల్లడించారు. కానీ ఏప్రిల్ 6న జరిగిన FY24 సమీక్షలో వృద్ధి అంచనాను 10 బేసిస్ పాయింట్లు పెంచారు.
ఏప్రిల్ 11న ప్రచురితమైన వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలోనూ భారత తలసరి ఆదాయాన్ని IMF తగ్గించింది. రాబోయే సంవత్సరానికి భారతదేశపు GDP వృద్ధి అంచనా సైతం 50 బేసిస్ పాయింట్లు తగ్గి 6.3 శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 2.8 శాతం మరియు 2024లో 3 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంటే జనవరి అంచనాలతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి.
English summary
IMF cuts India GDP growth upto 20 bps FY24
GDP growth cut
Story first published: Wednesday, April 12, 2023, 9:26 [IST]