For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 9:05 [IST]
Gold Price Today: బంగారం అంటే భారతీయులు చాలా మక్కువ. పైగా ప్రస్తుతం దేశంలో పంట చేతికొత్తింది కాబట్టి చాలా మంది తమ ఇంట్లో వారికో లేక శుభకార్యాలకోసమో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి షాకింగ్ న్యూస్ ఒకటి ఆందోళన కలిగిస్తోంది. అదే బంగారం ధరల పెరుగుదల..!
ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులను చూసిన చాలా మంది పసిడి ప్రియులి ఈ ధరల్లో గోల్డ్ కొనాలా..? వద్దా..? లేక మరికొంత కాలం వేచి ఉండాలా అనే డైలమాలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం బంగారం ధరలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.60 వేల మార్కును దాటేసింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ సైతం రూ.55 వేలకు పైనే ఉంది.
ఇంకో పది రోజుల్లో అక్షయ తృతీయ రాబోతోంది. ఇది భారతీయులకు చాలా కీలకమైన పర్వదినం. ఈ రోజు కనీసం ఒక్క కాసైనా బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఈ అమ్మకాల సీజన్ కోసమే దేశంలోని బంగారం దుకాణదారులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ పండుగ నాటికి గోల్డ్ ధర రూ.65 వేల మార్కును దాటేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు పెరగటానికి అనేక అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణంగా ఉన్నాయి. బ్యాంకింగ్ సంక్షోభం అమెరికాలో ఇంకా ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో చాలా మంది తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లలోని అనిశ్చితుల కారణంగా గోల్డ్ ఇన్వెస్టర్లకు తొలి ఎంపికగా మారిపోయింది. దీనికి తోడు మరోపక్క డాలర్ బలహీన పడటం బంగారం ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణంగా నిలుస్తోంది. అయితే దేశంలో పెరుగుతున్న గోల్డ్ డిమాండ్ తగ్గించేందుకు డిజిటల్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని కూడా భారీగానే పెంచేసింది. దీంతో దిగుమతులు సైతం భారీగానే తగ్గాయి.
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.61,430, ముంబైలో రూ.60,770, దిల్లీలో రూ.60,920, కోల్‌కతాలో రూ.60,770, బెంగళూరులో రూ.60,820, హైదరాబాదులో రూ.60,770, కోయంబత్తూర్‌లో రూ.61,430 ఉండగా.. విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం నగరాల్లో రూ.60,770గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర హైదరాబాదులో రూ.80,400గా ఉంది.
English summary
Gold rates to cross 65000 by akshaya tritiya amid global uncertinities, Know latest gold rates
Gold rates to cross 65000 by akshaya tritiya amid global uncertinities, Know latest gold rates
Story first published: Wednesday, April 12, 2023, 9:05 [IST]