• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home హైదరాబాద్

గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్ ఎవరో చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BhanuGopal Ch by BhanuGopal Ch
April 11, 2023
in హైదరాబాద్
0 0
0
గ్రూప్-1-ఫస్ట్-ర్యాంకర్-ఎవరో-చెబితే-రాష్ట్ర-ప్రభుత్వం-కూలిపోతుంది:-ఆర్ఎస్-ప్రవీణ్-కుమార్

RS Praveen Kumar: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసు నత్తనడకన ఎందుకు సాగుతోందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షలో మొదటి ర్యాంకర్ ఎవరో చెబితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన కమిటీలు అన్నింటిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విద్యార్థి నిరుద్యోగ భరోసా సభకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ రోజు #BSP ఆధ్వర్యంలో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగ భరోసా సభ జరిగింది. ⁦@TSPSCofficial⁩ అసలు దొంగలను ఇంకా ఎందుకు పట్టుకోలేదని పిల్లలడుగుతున్నరు? కమీషన్ లోని గజదొంగలను జైలుకు పంపకుండా ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రయోజనం శూన్యం. No exams till the commission is revamped pic.twitter.com/ycrbrJVKJ7

— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 11, 2023

పదో తరగతి పేపర్ లీక్ విషయంలో 24 గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు.. గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసి 30 రోజులు గడుస్తున్నా అసలు నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీ వెనక పెద్దలు ఉన్నారని, వారిని వదిలిపెట్టి చిన్నవాళ్లను అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, రామలింగా రెడ్డి, సుమిత్ర, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి వీళ్లంతా కూడా ముఖ్యమంత్రికి బాగా తెలిసిన వాళ్లే అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీఎం ఈ కేసులో నిజానిజాలను చెప్పే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. కేటీఆర్ ను పంపించి సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలన్నీఈ కేసులో నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, కొత్త బోర్డు వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18వ తేదీన ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏప్రిల్ 14 నాడు నగరం నడిబొడ్టున డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి సంక్షేమ పాలనపై ప్రజలకున్న 25 ప్రశ్నలు/సందేహాలను నివృత్తి చేయాలని కోరుతూ వారికి ఒక బహిరంగ లేఖ రాసి ఈ రోజు పంపినం. pic.twitter.com/6DcUR67q43

— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 11, 2023

అంబేద్కర్ విగ్రహావిష్కరణపై ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు

ఏప్రిల్ 14 అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇందులో 26 ప్రశ్నలు ఆయన సంధించారు. 

1) గత సంవత్సరం ఫిభ్రవరి నెలలో రెండు సార్లు మీడియా సమావేశం పెట్టి, భారత రాజ్యాంగం మార్చాలని, కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పిన మీరు, ఇపుడు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయడం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కదా? మీ మనసులో ఉన్న అసలు మాట చెప్పగలరా?

2) ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీల రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగం మార్చాలని ఆనాడు అన్నారు. మరి ఇప్పుడు రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న మీకు ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి, ఇప్పుడున్న రాజ్యాంగంలోని ఏ అధికరణ అడ్డం వచ్చింది? 

3) బీసీల కుల గణన కోసం రాజ్యాంగం మార్చాలన్నారు కదా? కులగణనను రాజ్యాంగం ఎక్కడ వద్దని చెప్పింది? తెలంగాణ ప్రజల సొమ్ముతో చేసిన నాటి సమగ్ర కుటుంబ సర్వేను మీ వద్దే ఎందుకు దాచుకున్నారు? సఙాన్ నిధుల పెంపు కోసం రాజ్యాంగం మార్చాలన్నారు కదా? 

4) మరి తొమ్మిదేళ్ల మీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎన్ని విడుదల చేశారు? ఎన్ని ఖర్చు చేశారు. ఎవరి కోసం ఖర్చు చేశారో చెప్పగలరా? సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాల్సిన స్టేట్ కౌన్సిల్ మీ అధ్యక్షతనే జరగాలి. మరి ఇంతవరకు ఒక్కసారి కూడా అలాంటి కౌన్సిల్ పెట్టిన దాఖలాలు లేవు ఎందుకు? మీకు ఇష్టమైన ప్రాజెక్టుల కోసం, మీకు నచ్చిన కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం రోజుల తరబడి సమీక్షలు పెట్టిన మీకు, గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహించే మీకు, కోటి మంది ఉన్న ఎస్సీ, ఎస్టీల కోసం స్టేట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టే సమయం కూడా దొరకలేదా?

5) ఎవరికీ అక్కరకు రాని, ఎవరూ అడగని నూతన సచివాలయాన్ని, అందులోని విలాస వంతమైన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 1500 కోట్లతో కేవలం రెండు సంవత్సరాల్లో నిర్మించిన మీకు, లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు సొంత భవనాలు కట్టాలని ఆలోచన ఎందుకు రాలేదు? విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా మీ గుండె కరగడంలేదు. ఎందుకని ?

6) 2016 నుండి ఎస్సీ మరియు ఇతర కార్పొరేషన్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదు ? లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ?

7) అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయం ప్రకారం, కాళేశ్వరం, మిషన్ భగీరథ, ‘మన ఊరు-మన బడి’ వంటి ప్రాజెక్టుల్లో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చారో చెప్పగలరా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పండి.

8) అన్ని అర్హతలు ఉన్నా రాణి కుముదిని అనే ఒక ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీగా ఎందుకు అవకాశం కల్పించలేదు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చీఫ్ సెక్రటరీగా నూతన సచివాలయ భవనంలో కూర్చోవడం మీకు ఇష్టం లేదని అనుకోవాలా?

9) ఇదే సచివాలయం సాక్షిగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగులకు ప్రమోషన్లకు బదులు రివర్షన్లు, ఆకునూరి మురళి లాంటి అధికారులకు కుర్చీలు కూడా సరిగా లేని గోదాముల్లో ఉన్న చీకటి ఆర్డినెన్స్ లాంటి ఆఫీసుల్లో జరిగిన అవమానాలు, ప్రదీప్ చంద్ర అనే ఎస్సీ వర్గానికి చెందిన అధికారికి చీఫ్ సెక్రటరీగా ఎక్స్ టెన్షన్ చేయడానికి మీకు కలిగిన ఇబ్బందులు ఏమిటో వివరించగలరా?

10) ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధికారులు ఒక్కరు కూడా లేకపోవడానికి గల కారణాలేమిటి? వారికి మీ వద్ద పనిచేసే అర్హతలు లేవా? లేక ఆ వర్గాల అధికారులంటే మీకు ఇష్టం లేదా ?

11) పదవిలో ఉండగా మరణించిన అధికార పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (ఎస్సీ) అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరుపలేదు ? ఎంతోమంది సినీ ప్రముఖులకు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలిచ్చిన మీరు? చావులో కూడా పేద వర్గాల పై వివక్షేనా?

12) సామాజిక ఉద్యమాల నాయకుడు మందకృష్ణ మాదిగని ఏం నేరం చేశారని నెలల తరబడి రెండు సార్లు జైలులో బంధించారు ?

13) మీ హయాంలో రాజ్యహింసకు బలైన ఖదీర్ ఖాన్, మరియమ్మ, నేరెళ్ల బాధితులకు ఏం న్యాయం చేశారు? వారి కుటుంబాలకు ఎలాంటి భరోసా అందించారో తెలుపగలరా? 

14) 3 లక్షల కోట్ల బడ్జెట్ లో రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బిసిలకు బడ్జెట్లో కేవలం ఆరు వేల కోట్లు (మూడు శాతం) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనికి సమాధానం చెప్పగలరా? 

15) అగ్రవర్ణాల ఆత్మగౌరవ భవనాలకు ఖరీదైన మాదాపూర్, కోకాపేట్లో దొరికిన భూమి, బీసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల భవనాలకు ఎందుకు దొరకదు? ఈ వర్గాలకు చెందిన వారి ఆత్మగౌరవ భవనాలు ఊరవతలి పొలిమేర ప్రాంతాల్లో ఎందుకు కేటాయించారు ? 

16) తెలంగాణ రాష్ట్ర మొదటి దళిత ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను ఏ కారణం చేత తొలగించారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ అడ్డంగా దొరికిన జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యులను ఇంకా ఎందుకు కాపాడుతున్నారు ? వివరణ ఇవ్వగలరా?.

17) దళితులకు మూడెకరాల భూమి పంచిస్తామని చెప్పి, వారి దగ్గరి నుండి వేల ఎకరాల అసైన్డ్ భూములను ఎందుకు లాక్కున్నారు? ఎవరి కోసం లాక్కున్నారో చెప్పగలరా? ఆ భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఆ కంపెనీ ఎంతమంది ఉద్యోగులు ఈ పేద వర్గాల వారు ఎంతమంది ఉన్నారు చెప్పగలరా ? 

18) భారత రాజ్యాంగం ద్వారా 315 అధికరణ ప్రకారం పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరపాలని అంబేడ్కర్ చెప్పితే, రాజ్యాంగ విరుద్ధంగా పేపర్ లీకేజీ జరిగి 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అంధకారంలో నిందితులను కాపాడుతున్నారు ? ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు 

19) ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ పేద విద్యార్థులు చదివే యూనివర్సిటీలు ఎందుకు శిథిలావస్థలో ఉన్నాయి, అక్కడ ఎందుకు ప్రొఫెసర్ల నియామకం జరపడం లేదు? అక్కడి లైబ్రరీల్లో కనీసం పుస్తకాలు కూడా ఎందుకు లేవు ? 

20) నిరుపేద దళిత కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదు ?

21) దళిత బంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఎందుకిస్తున్నారు ? రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి కట్టివ్వకుండా, మీరు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి 40 గదులు ఉన్న రాజభవనం వంటి ఇళ్లు ఎలా కట్టుకున్నారు? 

22) పేద విద్యార్థులు చదివే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సకాలంలో ఎందుకివ్వడం లేదు ? ఢిల్లీలో చదివే పేద విద్యార్థులకు పోస్టల్ సౌకర్యం ఎందుకు లేకుండా చేశారు ?

23) ప్రతినెలా ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు, అర్హులైన వారికి ఫించన్లు ఎందుకివ్వడం లేదు? మీరు మీ మంత్రులు మాత్రం నెలకు 4.25 లక్షలు ఎలా తీసుకుంటున్నారు ? పేదవాళ్ల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. ?.

24) భూప్రక్షాళన పేరుతో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులను ఎందుకు హింసిస్తున్నారు ? రైతు రుణమాఫీ హామీ ఎందుకు నెరవేర్చడం లేదు? కౌలు రైతుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోతున్నారు? 

25) నేటికీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం పని చేయాల్సిన రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ ఎస్టీ కమీషన్ ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నది ఎందుకు ?

Tags: Hyderabad NewsPaper leakageRS Praveen on BRSRS Praveen on KCRTelangana Newsహైదరాబాద్

Recent Posts

  • ఎట్టకేలకు విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ మూవీ సిద్ధం – ట్రైలర్ డేట్ ఫిక్స్
  • మొన్న
  • క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు
  • Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!
  • పొమన్నలేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబు అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In