మయన్మార్ పరిస్థితి అదుపు తప్పుతోంది. మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియాలో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడి చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ఆర్మీ ఎయిర్ స్టైక్ చేయగా కనీసం 100 మంది మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సగయింగ్ ప్రాంతంలోని కాంత్ బాలు టౌన్‌షిప్‌పై మయన్మార్ సైన్యం జుంటా బాంబు దాడి చేయడంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Tragic news from #Burma as the military junta bombed a village in the Sagaing region, killing around 100 people, including women and children. The international community must condemn this heinous act. We demand justice for the innocent lives lost! https://t.co/Xx7sY42psa
— Unitarian Universalist Service Committee (@UUSC) April 11, 2023