Celina Jaitly: బాలీవుడ్ లో ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు ఎక్కువగా చూసే ప్రతీ ఒక్కరికీ ఈయన పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో సినీ క్రిటిక్ గా చెలామణీ అవుతూ కొత్త సినిమాలను విడుదలకు ముందే మూవీ ఫ్లాప్ అంటూ ట్వీట్ లు చేస్తూ అందర్నీ పక్కదోవ పట్టింస్తుంటాడు. అంతే కాదు సినిమా రంగంలో ఉన్న సెలబ్రెటీలే టార్గెట్ గా వారిపై గాసిప్స్ పుట్టించి ప్రచారం చేస్తుంటాడు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఉమైర్ సంధుపై మండి పడ్డారు. కొంత మంది గట్టిగా హెచ్చరించారు కూడా. అయినా ఈ అయ్యగారి వ్యవహారంలో ఏ మార్పు రాలేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ పై సంచలన ట్వీట్ చేశాడు ఉమైర్. సెలీనా జైట్లీ గురించి బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన ‘జనషీన్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. దాదాపు ఆమె రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తోంది.
బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా సెలీనా పై సంచలన ట్వీట్ చేశాడు. అదేంటంటే.. బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. తాజాగా ఈ ట్వీట్ పై నటి సెలీనా స్పందించింది. ఉమైర్ చేసిన పనికి ఫైర్ అవుతూ రీట్వీట్ చేసింది ‘‘మిస్టర్ సంధు.. కనీసం నువ్వు ఇప్పుడైనా మనిషిగా మారతావనే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెడుతున్నాను. ముందు నువ్వు వెళ్లి మంచి డాక్టర్ని కలువు. తర్వాత నీ లైంగిక సమస్య నుంచి ఉపశమనం పొందుతావు’’ అంటూ చురకలంటించింది. అంతేకాదు ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతూ పబ్లిక్ ను పక్కదోవపట్టిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ట్విట్టర్ సేఫ్టీను ట్యాగ్ చేసింది సెలీనా. ఇక ఈ ట్వీట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి గాసిప్స్ ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ సెలీనా ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు.
ఉమైర్ సంధు ఇలాంటి ట్వీట్ లు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా పలువురు సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలీనా జైట్లీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొత్త సినిమాలు విడుదల అవుతున్నప్పుడు కూడా ఉమైర్ ఇలాంటి ట్వీట్ లు చేస్తూ ఉంటాడు. విడుదలకు ముందే ఈ సినిమా ఫ్లాప్ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. తెలుగులో కూడా పలు సినిమాలకు విడుదలకు ముందే ఫ్లాప్ అని ట్వీట్ చేశాడు. ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’, ‘సాహో’, ‘స్పైడర్’, ‘నాపేరు సూర్య’, ‘బీస్ట్’, ‘రాధేశ్యామ్’, ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాలకు ఫ్లాప్ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాల్లో కొన్ని హిట్లు అందుకున్నాయి. ఇవే కాదు ఇలా చాలా సినిమాలకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుంటాడు. తాజాగా సెలీనాపై చేసిన ఆరోపణలకు ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది. మరి మిగతా సెలబ్రెటీలపై వచ్చే ట్వీట్లపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : ‘ఐ లవ్ యు ఇడియట్’ రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?
Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da
— Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023