91,258 మంది
అటు రిటైర్డ్ ఈపీఎస్ సభ్యుల నుంచి 91,258 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. వీరు సెప్టెంబర్ 1, 2014 కంటే ముందు అధిక పెన్షన్ కోసం పరిగణించని రిటైర్డ్ ఉద్యోగులు. వారు దరఖాస్తు చేసుకునే అవకాశం మార్చి 4తో ముగుస్తుంది.
అధిక పెన్షన్ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
1. https://unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/memberకి వెళ్లాలి.
2.ఇక్కడ మీకు పెన్షన్ ఆన్ హయ్యర్ శాలరీ ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
3.ఇప్పుడు మీకు జాయింట్ అప్లికేషన్ ఫారమ్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది.
4. దీని తర్వాత అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించాలి. OTP బటన్‌పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు మీ ఫోన్లో ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌పై OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి సడ్మిట్ చేయాలి
ఎంత వస్తుందంటే..
ఒక వ్యక్తి 25 సంవత్సరల వయస్సులో ఉద్యోగంలో చేరి 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తే అతను 33 సంవత్సరాలు పని చేసినట్లు లెక్క.. మీ జీతం రూ. 40,000 అనుకంటే.. సాధారణ పెన్షన్ పథకం కింద వారి జీతంలో సంవత్సరానికి రూ.15 వేలు కట్ అవుతాయి. ఆ వ్యక్తికి ప్రతి నెలా పెన్షన్‌గా రూ. 7071 [(రూ. 15000×33)/70] పొందుతాడు. అధిక పెన్షన్ ఎంచుకుంటే జీతంలో సంవత్సరానికి రూ.40 వేలు కట్ అవుతాయి. ఆ వ్యక్తికికి పెన్షన్‌గా రూ. 18,857 [(రూ. 40000×33)/70] పొందుతారు.