- కేంద్రమంత్రి సమచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
- విశాఖ శారదాపీఠం ఆహ్వానంతో యజ్ఞానికి మంత్రి దంపతులు
- కురుక్షేత్రలో కొనసాగుతున్న లక్ష చండీ మహా యజ్ఞం
- శివరాత్రి సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు
అతి సనాతనమైన భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని మహ యజ్ఞం కురుక్షేత్రలో నిర్వహిస్తుండటం గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీ శారదానీఠం దీన్ని పర్యవేక్షించడం, అందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. కురుక్షేత్ర వేదికగా గుంతి ఆశ్రమం నిర్వహణలో చేపట్టిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో శనివారం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యజ్ఞం పరిపూర్ణమవుతుందని అన్నారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదని తెలిపారు. యజ్ఞభూమిని సందర్శించినపుడు విశేష అనుభూతి పొందానని, ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నా అని అన్నారు.

ఏకకాలంలో రుద్రం పలికిన 2200 బ్రాహ్మణులు
శివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన నిర్వహించారు. యజ్ఞభూమిలో చేపట్టిన ఈ ప్రత్యేక పూజలో 2200 మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. వారంతా ఏకకాలంలో రుద్రం చదువుతుంటే కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామ స్మరణతో మార్మోగింది. 8వ రోజు యజ్ఞంలో భాగంగా 6976 చండీ పారాయణ హోమాలను నిర్వహించారు. అలాగే పది వేల సార్లు శివ పంచాక్షరీ హోమాలను కూడా పూర్తి చేసారు. గుంతి మాతతో పాటు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు.




