- ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల (Gorantla)
- జగన్ ప్రభుత్వ విధి విధానాలను ఎండగట్టిన ఎమ్మెల్యే గోరంట్ల…
- నిరుపేదల కడుపు కొడుతున్న వైకాపా ప్రభుత్వం
రాష్ట్రంలో వైసీపీ సర్కారు నిరుపేదల కడుపులు కొడుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.నేడు హుకుంపేట పంచాయతీ డి-బ్లాక్ లో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గోరంట్ల గ్రామంలో ఉన్న వివిధ వర్గాల వారిని కలిసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పత్రాలను అందచేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో పోవాలి సైకిల్ రావాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ప్రజల రేషనకార్డులు తొలగింపు, వృద్ధాప్య పింఛన్లు తొలగించడం లాంటి కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. పాలకుల అసమర్థత, స్థానిక నాయకుల స్వార్థం రెండు కలగలసి సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనాన్ని దుర్భరంగా మార్చేస్తున్నాయని మండిపడ్డారు.ఇంటి పన్ను, చెత్తపన్ను, కరెంటు బిల్లులు పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఒకొక్కరు ఒకొక్క సమస్యతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువ య్యారన్నారు.
చంద్రబాబు పాలనలో ఇచ్చిన పింఛన్లను తొలగిస్తున్నారని ఆందోళన చెందుతున్నారన్నారు. మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని సానుకూల దృక్పథంతో ప్రజలు తమను స్వాగతిస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో నేను మత్సెటి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, పెండ్యాల రామకృష్ణ,బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్,గారపాటి నాగేశ్వరరావు, బొప్పన నాగేశ్వరరావు,బొప్పన శ్రీను, వీరా సింగ్,దార అన్నవరం, పిల్లా తనుజ, మద్దా మణి, బైరెత్తి సరోజినీ, ఎమ్మెస్సార్ శీను, కోరాడ వెంకటేష్, ఇమ్మంది శివరామకృష్ణ,ఎస్ కే భాష, కే దుర్గాప్రసాద్,లాజర్, బత్తిన ఏడుకొండలు చెల్లి రాము ఇల్లి రమణ,టి. రమణ ,పలివేలు లలిత, మామిడి లక్ష్మి, భాగ్యం, రమణయ్య, కాసినడా నాగబాబు, అలంకర్ శ్రీను,సత్తిబాబు, సతీష్ ఎంకే దాసు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


