నిమ్మకాయల చినరాజప్ప పత్రికా ప్రకటన వివరాలు….
- వివేకా హత్య కథ, స్రీన్ ప్లే, డైరెక్షన్ సీఎం దంపతులదే
- తమ పాత్ర లేకుంటే హత్య జరిగిన రోజు కాల్ డేటా బయటపెట్టాలి
- వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై జగన్ రెడ్డి, భారతి రెడ్డి నోరు తెరవాలి.
- హత్యతో తమకు ఎలాంటి సంబంధమూ లేకపోతే హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 03-04 గంటల మధ్య అవినాశ్ రెడ్డితో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ల ద్వారా ఏం మాట్లాడారు?
- హత్య గురించి కాకపోతే అంత అర్ధరాత్రి వేళ ఏం మాట్లాడుతారు?
- జగన్ రెడ్డి, భారతి రెడ్డికి హత్యతో సంబంధం లేకపోతే.. నాటి కాల్ డేటాను బయట పెట్టమని సీబీఐని కోరి తమ నిజాయితీని నిరూపించుకోగలరా?
- హత్య ఆనవాళ్లను అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ద్వంసం చేశారు.
- ఆనవాళ్లను ద్వంసం చేయడమంటే హత్యతో సమానమేనని ఎంపీ స్థాయి వ్యక్తికి తెలియదా?
- 70 ఏళ్ల వయసు, గుండె ఆపరేషన్ చేసుకున్న వివేకానంద రెడ్డి గుండెపై గుద్ది, గొడ్డలితో తలపై, చాతిపై అత్యంత పాశవికంగా నరికి హత్య చేశారు.
- అంతటి కిరాతకమైన ఘటన చూసిన తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఖననం చేసేందుకు ప్రయత్నించడం హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర చెప్పకనే తెలుస్తోంది.
- అయినా జగన్ రెడ్డి అవినాశ్ రెడ్డిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు?
- గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గుండెపోటు అంటూ భారతి రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి ఛానళ్లో ఎందుకు వార్తలు నడిపించారు?
- వివేకా హత్య కేసులో అరెస్టైన డి.శివశంకర్ రెడ్డిని వైసీపీ నుండి ఎందుకు బహిష్కరించలేదు?
- హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అడిషనల్ ఎస్పీ రాంసింగ్ ను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం జగన్ రెడ్డి ప్రోద్బలం లేకుండానే జరిగిందా?
- వివేకా హత్య కేసులో నిందితుడిగా అరెస్టైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా రిమ్స్ కు తరలించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్ర లేదని చెప్పగలరా?
- కడప ఎంపీ సీటు కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగిందని జగన్ రెడ్డి సొంత చెల్లెల్లు చెప్పడం అబద్దమా?
- సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొనడం అబద్దమా?
- ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమక్షంలో దేశం మొత్తం చూసేలా ఆవిష్కరిస్తే.. దానిపై పేరు లేదు అని చెప్పడం కుంటి సాకులు వెతకడమే.
- భారతి రెడ్డి పీఏ ‘నవీన్’తో మాట్లాడినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులకు చెప్పడం వలనే సీబీఐ అధికారులు నవీన్ ను విచారించారనేది నిజం కాదా?
- పీఏల గురించి అవినాశ్ రెడ్డి బయట పెట్టడం, అధికారులు విచారించడంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, భారతి రెడ్డి ఎందుకు మౌనం దాల్చారు?
- వారు నోరు మెదపకుండా.. పేర్ని నాని అనే వ్యక్తికి ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నాడు?
- భారతీ రెడ్డి ఏమైనా చట్టానికి అతీతులా?
- భారతి రెడ్డి గురించి పుస్తకంలో గానీ, బయట గానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ నేతలు అసభ్యంగా మాట్లాడలేదు. రాతలు రాయలేదు.
- అవినాశ్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్న మాటలనే టీడీపీ తన పుస్తకంలో రాసింది.
- కేసుతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తే.. తక్షణమే హత్య జరిగిన రోజు కాల్ డేటాను బయట పెట్టాలని జగన్ రెడ్డి దంపతులు సీబీఐని కోరాలి.