పంచుమర్తి అనురాధ విలేఖరుల సమావేశం వివరాలు…
- డిల్లీ లిక్కర్ స్కాంపై వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు?
- తాడేపల్లి ప్యాలెస్ కి డిల్లీ లిక్కర్ స్కాంకి ఉన్న గండికోట రహస్యం ఏంటి?
- మద్యంలో జగన్ మూడున్నరేళ్లలో రూ. 31 వేల కోట్లు దోచుకున్నారు
- దేశంలో ఏ స్కామ్ బయటపడ్డా అందులో ఏపీ మూలాలు బయటపడుతున్నాయని, వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం రాష్ట్ర ప్రతిష్ట మంటగలుపుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.
- మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….
- దేశంలో ఏ స్కాం జరిగినా, ఎక్కడా గంజాయి పట్టుబడినా అందులో ఏపీ మూలులాన్నయని పొరుగు రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు.
- వైసీపీ నేతలు డిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని డిల్లీ నడివీధుల్లో రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారు.
- ఈ కేసులో ఏ5 ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరక్టర్ గా ఉన్న పెనాక శరత్ చంద్రారెడ్డి స్వయాన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు.
- ఈ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో రూ. 70 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది.
- డిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డిని, వైసీపీ ఎంపీ కొడుకును అరెస్టు చేసినా ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు?
- వైసీపీ నేతల మౌనానికి అర్దం ఏంటి?
- ప్రతిదానికి ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే రోజా డిల్లీ లిక్కర్ స్కాంపై ఎందుకు నోరు మెదపటం లేదు?
- తాము అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేదం చేసి పైవ్ స్టార్ హోటల్లకి మాత్రం పరిమితం చేస్తామన్న వారు డిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు పట్టుబడటంపై ఏం సమాధానం చెబుతారు?
- ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి రూ. 26 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముతున్నామని చెబుతున్నారు. కానీ అనధికారికంగా ఏడాదికి రూ. 31 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
- ఈ మూడున్నరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా మద్యం అమ్మకాల్లో రూ. 18 వేల కోట్లు, మరోవైపు డిస్టలరీల నుంచి కమీషన్ల రూపంలో రూ. 13 వేల కోట్లు కలిపి మెత్తం రూ. 31 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేరాయి.
- ఈ డబ్బును డిల్లీ లిక్కర్ స్కాం లో పెట్టుబడులుగా పెట్టారు. ఇది నిజం కాదని మంత్రి రోజా చెప్పగలరా?
- జగన్ మోహన్ రెడ్డి జలగ మోహన్ రెడ్డిలా మారి నాసిరకం మద్యంతో మహిళల తాలిబొట్లు తెంచి కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నారు.
- డిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ హస్తం ఉందనేది స్పష్టమవుతోంది.
- తాడేపల్లి ప్యాలెస్ కి డిల్లీ లిక్కర్ స్కాంకి ఉన్న గండికోట రహస్యం ఏంటో వైసీపీ నేతలు ప్రజలకు చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.