నేటి నారా లోకేష్ పాదయాత్ర….సమస్యలు వింటూ… నేనున్నానని భరోసా ఇస్తూ…
- 200 కిమీ మైలురాయి అందుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ పాదయాత్ర
- కత్తెరపల్లి జంక్షన్ లో శిలాఫలకం ఆవిష్కరణ
- అభివృద్ధికి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందన్న లోకేశ్
- ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని చెప్పేందుకు సోదరి మోహన జీవితమే ఒక ఉదాహరణ.
- టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం నాటికి 200 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది.
- జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జంక్షన్ లో యువనేత పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకోగానే… కార్యకర్తలు లోకేశ్ పై పూలవర్షం కురిపించారు.
- పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ జయజయధ్వానాలు పలికారు.
- జయహో లోకేశ్… జయహో తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
- యువగళం జైత్రయాత్ర 200 కిలోమీటర్లు చేరుకున్నందుకు గుర్తుగా టీడీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ…
- జీడీ నెల్లూరులో మహిళా డిగ్రీ కాలేజి లేదని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇక్కడ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
- ప్రజాచైతన్యమే లక్ష్యంగా వేగంగా అడుగులు
- 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, నిర్ణీత టార్గెట్ కంటే ముందుగానే లోకేశ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు.
- రోజుకు సగటున 10 కిలోమీటర్లు నడవాలన్నది లక్ష్యం కాగా, గత 16 రోజుల్లో సగటున 12.5కిలోమీటర్లు నడిచారు.
- లోకేశ్ నేడు అత్యధికంగా 17.7కిలోమీటర్లు నడిచారు.
- ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని చెప్పేందుకు సోదరి మోహన జీవితమే ఒక ఉదాహరణ.
- జగన్ అరాచకపాలనలో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.
- ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని చెప్పేందుకు సోదరి మోహన జీవితమే ఒక ఉదాహరణ.
- పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చలేక భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.
- కుటుంబ పోషణ కోసం చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకుంది.
- చదువు పూర్తిచేసిన పిల్లలకు ఉద్యోగాలు రాక తల్లికి చేదోడుగా ఉంటున్నారు.
- తన కష్టాలన్నీ చెప్పుకున్న సోదరి..బాబు వస్తేనే బాగుపడతాం అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది అని నారా లోకేష్ తెలిపారు.