ఎస్టీ సామాజికవర్గ ప్రతినిధులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు,ఎమ్మెల్సీ, నారా లోకేష్ ముఖాముఖి
ఈ సందర్భంగా ఎస్టీ సామాజికవర్గ ప్రతినిధలు మాట్లాడుతూ…
• లోకేష్ ను కలిసిన ఎస్.ఆర్.పురం మండలం మెదవాడ పంచాయతీ ఎస్టీ కాలనీ ప్రజలు
• తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని వినతిపత్రం ద్వారా లోకేష్ కు వివరణ.
• తమకు స్థిర నివాసాలు లేవని, వాటిని ఏర్పాటు చేయాలని వేడుకోలు.
• ఎస్టీ కార్పొరేషన్ నుండి ఎటువంటి లోన్లు అందడం లేదు.
• ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదు.
• ప్రకృతి వనరులు తేనె, వగైరా సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు.
• పెళ్లికానుకలు అండం లేదు.
• గతంలో 50ఏళ్లకు పెన్షన్ ఇచ్చారు..నేడు 60ఏళ్లకు ఇస్తున్నారు.
• టీచర్ ట్రైనింగ్ చేయకున్నా టీచర్ ఉద్యోగాలు ఇచ్చే విధానం నిలిపేశారు.
అనంతరం నారా లోకేష్ స్పందిస్తూ…
• ఎస్టీలకు జగన్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి ద్రోహం చేసింది.
• ఎస్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి ఒక్కరికి కూడా సబ్సిడీలోన్ ఇవ్వలేదు.
• విదేశీవిద్య పథకాన్ని నిలిపివేసి పేద ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారు.
• పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.
• అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం చేస్తాం..
• ఎస్టీ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.