కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేఖరుల సమావేశం వివరాలు…
- రాజధాని నిర్మాణాన్ని అటకెక్కించిన జగన్ రెడ్డి, ఏముఖం పెట్టుకొని సీఆర్డీఏ ద్వారా బ్యాంకులనుంచి అమరావతి పేరుచెప్పి రూ.3,013కోట్ల రుణం తీసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల్ని మోసగించి, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను తలదన్ని జగన్ రెడ్డి ‘మోసగాళ్లకు మోసగాడు’ అయ్యాడు.
- 2019 డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నానని ఇకపై, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా వైజాగ్ మాత్రమే ఉంటుందని చెప్పిన జగన్ రెడ్డి, ఉద్దేశపూర్వకంగా కావాలనే అప్పులకోసం అమరావతి నిర్మాణంపేరిట బ్యాంకుల్ని మోసగించాడు.
- 2019-20 కాగ్ నివేదిక పేజీనెం-50లో సీఆర్డీఏసంస్థ ద్వారా అమరావతి ముసుగులో జగన్ రెడ్డి తీసుకున్నఅప్పుల వివరాలున్నాయి.
- తీసుకున్న అప్పుకి కనీసం వడ్డీకూడా చెల్లించకపోవడంతో, బ్యాంకు అధికారులు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి గట్టిగా నిలదీశారు.
- చంద్రబాబుగారి హయాంలో ఏపీ సీఆర్డీఏకి క్రిసిల్ సంస్థ A(+) రేటింగ్ ఇస్తే, జగన్ రెడ్డి అసమర్థత, చేతగానితనంతో సదరు రేటింగ్ A(-)కి వచ్చేసింది.
- వడ్డీచెల్లింపులకు కూడా ప్రభుత్వఅకౌంట్లలో కనీసబ్యాలెన్స్ జగన్ ప్రభుత్వం మెయింటెన్ చేయనందునే రేటింగ్ తగ్గించినట్టు క్రిసిల్ స్పష్టంచేసింది.
- చంద్రబాబుగారి హాయాంలో ఏనాడైనా బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించాలంటూ నిలదీసిన దాఖలాలు ఉన్నాయా?
- నిన్నటివరకు ఇదేంఖర్మ-రాష్ట్రానికి అని వాపోయిన ప్రజలంతా, నేడు ‘నువ్వే మాదరిద్రం జగన్’ అని తలలు బాదుకుంటున్నారని, రాజధాని అమరావతే కాదనిచెప్పిన ముఖ్యమంత్రి, తిరిగి అమరావతి నిర్మాణంపేరుతో రుణాలుతీసుకొని బ్యాంకుల్ని మోసగించి, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను తలదన్ని ‘మోసగాళ్లకు మోసగాడు’ అయ్యాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
- మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
- “రాష్ట్రప్రజలంతా కొత్తగా ‘మా దరిద్రం నువ్వే జగన్’ అంటున్నారు. జగన్ రెడ్డి అవినీతి దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రజలంతా, ఇప్పుడు కొత్తగా అమరావతిపేరుతో జగన్ రెడ్డి చేసిన మోసాన్ని చూసి నివ్వెరపోతున్నారు.
- అమరావతి నిర్మాణం పేరుతో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ, నిన్న ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో అధికారుల్ని బ్యాంకర్లు నిలదీశారని పత్రికల్లో వచ్చింది. తీసుకున్న రుణానికి వడ్డీకట్టలేదని కొందరు బ్యాంకర్లు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే, వారికేం చెప్పాలో తెలియక సీఆర్డీఏ కమిషనర్ ముఖం చాటేసిన వైనాన్ని కూడా ప్రజలంతా గమనించారు. ఈ వ్యవహారం వెనకున్న ఘరానా మోసగాడు జగన్ రెడ్డే. వివిధ కార్పొరేషన్లు, సంస్థల పేరుతో జగన్ రెడ్డి ఇప్పటికే ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నాడు. అప్పులు తీసుకొని అసలు, వడ్డీ ఏదీ కట్టకపోతుండటంతో బ్యాంకర్లు ఆయన ప్రభుత్వాన్ని, అధికారుల్ని నిలదీస్తున్నారు. అప్పువసూళ్లకు స్వయంగా బ్యాంకు అధికారులే ప్రభుత్వకార్యాలయాల గుమ్మం తొక్కడం రాష్ట్రానికి అవమాన మని, తలవంపులనికూడా ముఖ్యమంత్రికి అనిపించకపోవడం విచారకరం.రాజధాని అమరావతికాదని చెప్పి, తిరిగి అమరావతి నిర్మాణం పేరుతో బ్యాంకుల్ని మోసగించి, రూ.3వేలకోట్ల అప్పులు తీసుకున్న జగన్ రెడ్డి ‘మోసగాళ్లకు మోసగాడు’ .
- 2019-20కి సంబంధించి CAG (Comptroller And Auditor General Of India) విడుదల చేసిన ఆర్థికనివేదికలో ముఖ్యమంత్రి అప్పులచిట్టా వివరాలున్నాయి. ఏ అప్పులు కట్టండి అని నిన్న బ్యాంకు అధికారులు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారో, ఆ అప్పుకి సంబంధించిన వివరాలు CAG నివేదికలో ఉన్నాయి. నివేదికలోని పేజీ నెం-50లో సీఆర్డీఏ రూ.3వేల13కోట్ల60లక్షల రుణం తీసుకున్నట్టు ఉంది. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 2019న ఈ రాష్ట్రానికి ఇకపై మూడురాజధానులు ఉంటాయని, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నాని చెప్పిన జగన్ రెడ్డి, రాజధానిలో 80శాతం వరకు పూర్తైన నిర్మాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా నిలిపేశాడు. అంతదారుణంగా ప్రవర్తించిన ఈ దుర్మార్గుడు బ్యాంకులకు మాత్రం అద్భుతమైన రాజధాని కడుతున్నాననిచెప్పి అప్పులు కొల్లగొట్టాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల నుంచి రాజధాని నిర్మాణంపేరుతో రూ.3,013కోట్ల రుణం తీసుకోవడం జగన్మోసపురెడ్డి చేసిన పచ్చి మోసం కాదా? ఒకపక్క రాజధానినిర్మాణం ఆపేసి, మరోపక్క సిగ్గులేకుండా బ్యాంకుల వద్ద అప్పులు తీసుకున్న జగన్ రెడ్డి, విజయ్ మాల్యా నీరవ్ మోదీ లాంటి వాళ్లను తలదన్ని ‘మోసగాళ్లకు మోసగాడు’ అయ్యాడు. రాజధాని నిర్మాణం ఆపేసిన వ్యక్తి సిగ్గు, శరంలేకుండా నిర్మాణం కొనసాగిస్తున్నానని చెప్పి అప్పులు తీసుకున్నదికాక, విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
చంద్రబాబు హాయాంలో ఏ బ్యాంకుసిబ్బంది అయినా అప్పుకట్టాలని ప్రభుత్వాధికారు ల్ని అడిగిన దాఖలాలు ఉన్నాయా?
- చంద్రబాబునాయుడి హాయాంలో ఏనాడైనా ఏ బ్యాంకుఅధికారి అయినా అప్పు కట్టండి అంటూ ప్రభుత్వకార్యాలయం వద్దకువచ్చాడా? అప్పులుకట్టాలని అధికారుల్ని, ఉద్యోగుల్ని నిలదీసిన దాఖలాలు ఉన్నాయా? సాధారణ, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో అప్పులుతీసుకుంటే, అది కట్టేవరకునిద్రపోరు. ఎక్కడ బ్యాంకువాళ్లు తమ గుమ్మం ముందుకు వస్తారోనని, అవమానాలు, తలవంపుల భయంతో ఎప్పుడు అప్పుతీర్చేద్దామా అని చూస్తారు. కానీ ఘరానా మోసగాడు జగన్ రెడ్డి మాత్రం ఎన్ని అప్పులైతే నాకేంటి…నాదేం పోయిందన్నట్టుగా వ్యవహరిస్తూ, రాష్ట్రపరువు ప్రతిష్ఠల్ని మంటగలిపేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ఏపీ సీఆర్డీఏకి క్రిసిల్ ఇచ్చిన రేటింగ్ A(+) అయితే, జగన్ రెడ్డి నిర్వాకంతో అది A(-)కి వచ్చింది.
- క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ వివిధ రాష్ట్రప్రభుత్వాలు, సంస్థలకు క్రెడిట్ రేటింగ్ ఇస్తుంటుం ది. ఆ క్రిసిల్ సంస్థ ఆగస్ట్ 18, 2022న ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్డీఏ) రేటింగ్ తగ్గించింది. అంతకుముందు చంద్రబాబుగారి హాయాం లో A(+) రేటింగ్ ఉంటే, దాన్ని A(-) కు తగ్గించింది. వడ్డీచెల్లింపులకు కూడా ప్రభుత్వ అకౌంట్లలో కనీసబ్యాలెన్స్ ని జగన్ ప్రభుత్వం మెయింటెన్ చేయడంలేదని, దానివల్లనే ఏపీ సీఆర్డీఏ రేటింగ్ తగ్గిస్తున్నట్టు క్రిసిల్ స్పష్టంచేసింది. అంతేకాకుండా అమరావతి బాండ్స్ కు గ్యారంటీగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి విపరీతంగా అప్పులు పెరిగిపోవడం కూడా ఒక కారణమని క్రిసిల్ సంస్థ చెప్పింది. గతంలో చంద్రబాబుగారి హాయాంలో అంతర్జాతీయస్థాయిలో రాష్ట్రపరువు, పరపతి బాగుండేది. దానికి ఉదాహరణే అమరావ తి బాండ్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రూ.2వేలకోట్లు, రూ.1300కోట్లకోసం నాడు టీడీపీప్రభుత్వం అమరావతి బాండ్స్ మార్కెట్లో అమ్మకానికిపెడితే, గంటల వ్యవధిలోనే రూ.2వేలకోట్లు వచ్చాయి. అదీ చంద్రబాబునాయుడి గారి క్రెడిబులిటీకి ఉన్న ఉదాహరణ. కానీ నేడుజగన్ రెడ్డి నిర్వాకం, ఆర్థికక్రమశిక్షణలేని అసమర్థ ప్రభుత్వ చేతగానితనంవల్ల రాష్ట్రపరువు, ప్రతిష్ఠలు మంటగలుస్తున్నాయి. ఆఖరికి ప్రభుత్వ ఖాతాల్లో కనీసనిల్వమొత్తాలు కూడా మెయింటెన్ చేయలేని దుస్థితికి జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థంచేసుకోవాలి. అమరావతి బాండ్స్ కుసంబంధించి ఉన్న మారటోరియం పీరియడ్ 2023 మార్చితో ముగియ నుంది. 2023-24 ఏప్రియల్ నుంచి బాండ్స్ పై తీసుకున్న రుణానికి సంబం ధించి సంవత్సరానికి రూ.400కోట్ల అసలుచెల్లించాలి. నేడు కనీసం వడ్డీకూడా చెల్లించ లేని పరిస్థితిలోఉన్న ఈప్రభుత్వం అసలు ఏరకంగా చెల్లిస్తుందో వేచిచూడాలి. రాజధాని నిర్మాణాన్ని అటకెక్కించి, రైతులనోట్లో మట్టికొట్టి, సీఆర్డీఏపేరుతో బ్యాంకుల నుంచి జగన్మోసపురెడ్డి తీసుకున్న రూ.3,013కోట్లు, ఎప్పటికైనా తిరిగి చెల్లించాల్సింది రాష్ట్ర ప్రజలే. చేయాల్సినన్ని అప్పులుచేసి, రాష్ట్రాన్ని దివాళాతీయించిన ఈదుర్మార్గపు ముఖ్యమంత్రి ఆ సొమ్మంతా తనఖజానాకు తరలిస్తున్నాడు. ఎన్ని అప్పులైతే నాకేం టి… నన్నుఅడిగేది ఎవడన్న ధీమాతోనే మోసగాడు జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అప్పులకుప్పగా మార్చాడు. ఈ విధంగా రాష్ట్రపరువు, ప్రతిష్ఠలను బ్యాంకుల ముందు దిగజార్చి భవిష్యత్ లో ఎటువంటి అప్పు రాష్ట్రానికి పుట్టనటువంటి పరిస్థితి తీసుకొ చ్చాడు కాబట్టే, జనమంతా ముక్తకంఠంతో ‘మా దరిద్రం నువ్వే జగన్’ అంటున్నారు” అని పట్టాభి ఎద్దేవాచేశారు.