- నారా లోకేష్ పరుగుతో కార్యకర్తల్లో ఉత్సాహం.. పాదయాత్రలో ఉత్తేజం
- జిడి నెల్లూరులో సాగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వడివడి అడుగులు ఒక్కసారిగా వేగం అందుకున్నాయి.
- పాదయాత్రలో నడుస్తున్న వారిలో ఉత్సాహం ఉరకలెత్తింది.
- పరుగు అందుకున్న లోకేష్ జనంలో ఉత్తేజం నింపారు.
- వైసీపీ సర్కారు చర్యలతో పోలీసుల వల్ల అడుగడుగునా ఇబ్బందులు పడుతూ, ఆటంకాలను అధిగమిస్తూ వస్తున్న లోకేష్ నడకని కాసేపు గేరు మార్చి పరుగుని ఆరంభించారు.
- వెంట వస్తున్న టిడిపి నేతలు, అభిమానులు, భద్రతాసిబ్బంది, స్థానికులు అంతా లోకేష్ వెంట పరుగులు పెట్టారు.
- పిళ్ళారి కుప్పం సమీపంలో శనివారం ఉదయం పాదయాత్రలో లోకేష్ ఆరంభించిన రన్నింగ్ రేసులో అంతా హుషారుగా పాల్గొన్నారు.
- పోలీసులు నిర్బంధం, అడ్డగింతలు, అరెస్టులతో సాగుతున్న పాదయాత్రలో లోకేష్ ఎక్కడా తగ్గడంలేదు.
- పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నవాళ్లు ఒక్క ఇంచు వెనకడుగు వేయడంలేదు.
- ఎంత ఇబ్బంది పెడితే అంత కంటే పట్టుదలగా యువగళం వినిపిస్తామని అంతా ఒక్కటై నినదించారు.
- లోకేష్ పరుగు నింపిన ఉత్తేజంతో మరింత ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు.