- ఉద్యోగం కోసం యువత అడ్డదారులు…
- లోదుస్తుల్లో తూకపు రాళ్లు..
- కాళ్లకు ఇనుప గొలుసులు!
ఉద్యోగం కోసం నలుగురు యువకులు అడ్డదారులు తొక్కి దొరికిపోయారు. దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లో అర్హత సాధించేందుకు.. తగినంత బరువు లేని ఓ వ్యక్తి లోదుస్తుల్లో తూకపు రాళ్లను పెట్టుకుని రాగా.. మరో వ్యక్తి నడుంకు ఇనుప బెల్ట్ కట్టుకుని వచ్చాడు. ఇంకొకరు బరువైన చొక్కా ధరించి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,619 ఉద్యోగాలను ఫిట్‌నెట్ పరీక్షల ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అభ్యర్థులు నిర్ణీత ఎత్తుతో పాటు 55 కిలోల బరువు ఉండాలని నిర్దేశించింది. 38,000 మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కలబురిగి జిల్లాలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల సందర్భంగా నలుగురు అభ్యర్థులు బరువు సరిపోవడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి ఐదేసి కిలోల బరువున్న రెండు తూకపు రాళ్లను లోదుస్తుల్లో పెట్టుకున్నాడు. మరో వ్యక్తి ఇనుప గొలుసును నడుంకు చుట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఇనుప గొలుసును కాళ్లకు కట్టుకున్నాడు. నాలుగో వ్యక్తి ప్రత్యేకంగా రూపొందించిన ఓ బరువైన షర్ట్‌ను ధరించి వచ్చాడు. అధికారులు వీరిని గుర్తించి ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించారు.