తెలంగాణ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఛైర్ పర్సన్‌లు, మేయర్‌లపై అవిశ్వాస తీర్మానాలు కామన్ అయిపోతున్నాయి … ఇప్పటికే పలు చోట్ల ఈ తీర్మానాలు పెండింగ్‌లో ఉన్నాయి … తాజాగా గజ్వేల్‌లో కూడా అవిశ్వాస ఎపిసోడ్ మొదలైంది.. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట… ఆ క్రమంలో పార్టీ ఛైర్మన్లు, మేయర్లు ఓడిపోకుండా చూసే బాధ్యతలు మంత్రులకు కట్టబెట్టారంట
మున్సిపల్ మేయర్, చైర్మన్ల అవిశ్వాసాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. … అవిశ్వాస సమస్యలన్నీ తొలగిపోయే విధంగా ప్లాన్ చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు సమాచారం …. అవసరమైతే భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన పలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, చైర్మన్లపై సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.మున్సిపల్ యాక్టు ప్రకారం అవిశ్వాస నోటీసు ఇచ్చిన 21 రోజుల లోపు కలెక్టర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస నోటీసులపై ఓటింగ్ నిర్వహించాలి. ఈనెల 20 తర్వాత వరసగా అవిశ్వాస తీర్మాణాలపై ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవిశ్వాలు నెగ్గి, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా ఉండే మున్సిపాలిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తుంది… ఆ లిస్టులో జవహర్ నగర్, పెద్ద అంబర్ పేట్, ఇబ్రహీంపట్నం, తాండూరు, జనగాం, వికారాబాద్, గజ్వేల్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, నందికొండ, యాదగిరిగుట్ట, చండూర్ ఉన్నట్టు సమాచారం.
ఓటింగ్‌లో సొంత పార్టీకి చెందిన మేయర్, చైర్మన్లు ఓడిపోకుండా చూడాలని ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. నిరసన గళం విప్పిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మాట్లాడాలని అదేశించినట్టు తెలిసింది. దారిలోకి తెచ్చుకునేందుకు సామ, ధాన, దండోపాయాలు ప్రయోగించి, అవిశ్వాసాలు వీగిపోయేందుకు చూడాలని సంకేతాలు ప్రగతిభవన్ నుంచి వచ్చినట్టు పార్టీ లీడర్లు చెపుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు లోకల్ పోలీసుల సహకారం తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.మున్సిపాల్టీలో అధికార పార్టీ చైర్మన్లు, మేయర్లు ఓడిపోతే ఆ ప్రభావం త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పడుతోందని భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకున్నట్టు చర్చ జరగుతోంది. ఈ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి, వర్గపోరు బహిర్గతమయ్యే చాన్స్ ఉంటుంది. ఈ యాక్టివిటీస్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని బలహీనపరచే ప్రమాదం ఉంటుంది. అందుకే అసమ్మతిని కట్టడి చేయాలని ప్రగతిభవన్ వర్గాలు ఆదేశించినట్టు సమాచారం. అందుకోసం సహకరించేవారికి తాయిళాలు, మొండికేసినవారిపై పాత కేసులను తెరమీదికి తేవాలని సూచించినట్టు తెలుస్తోంది
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి పార్టీకి రిజైన్ చేశారు … ఈలోపు సొంత పార్టీ కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు … అయితే ఆమెను బుజ్జగించి పార్టీ వీడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. తాజాగా అసెంబ్లీలో జగిత్యాలకు చెందిన ఎమ్మెల్యేలు, లీడర్లు ప్రత్యేకంగా సమావేశమై శ్రావణిని పార్టీలో కొనసాగించేందుకు ఏం చేయాలో చర్చించినట్టు సమాచారం.చైర్ పర్సన్ బీజేపీలో చేరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారు. ఆ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ శ్రావణి బీజేపీ నుంచి పోటీ చేస్తే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే శ్రావణిని పార్టీలో కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్నారంట