Modi Demonetisation Effect for Bharath after 6 years 3 months :
2016 నవంబర్ 8 న ప్రధాని మోడీ తీసుకున్న డిమోనిటైజేషన్ (demonitisation) నిర్ణయము ఆ నాడు దేశ ప్రజల జీవన విధానాన్ని కొన్ని రోజుల పాటు అతలాకుతలం చేసింది. మేధావులు సైతం కొంతమంది వ్యతిరేకించారు. మరికొంత మంది మోడీ తీసుకున్న నోట్ల రద్దు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక రకంగా ఈ నిర్ణయం సాహసాపేత నిర్ణయమనే చెప్పువచ్చు. ఆనాడు వేసిన విత్తనం ఈ రోజు మొలకెత్తిందా ..?
కాస్త వివరంగా మాట్లాడుకుందాం …
నవంబర్ 8, 2016 రాత్రి 8:15 గంటలకు, దేశ ప్రజలందరూ టీవీల ముందుకు చేరారు. డ్రామాలు, క్రికెట్ మ్యాచ్లు, గేమ్ షో లు అన్ని కూడా ఒక్కసారిగా ప్రధాని మంత్రి మోడీ ముఖంతో భర్తీ చేయబడ్డాయి. మోడీ ఏమి చెప్తారో అనే ఆసక్తే అందరిలో.. కట్ చేస్తే …

రూ . 500 మరియు 1000 నోట్లు నాటి అర్ధరాత్రి నుంచి రద్దు (Demonetisation) చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ద్రవ్య విలువ లేకుండా, అవి కాగితపు ముక్కలుగా మారనున్నాయి. పన్ను ఎగవేతల / ఆర్ధిక నేరాల ముగింపునకు సరైన మార్పులని ప్రధాని భావించారు. ప్రభుత్వ కళ్లుకప్పి నల్లధనాన్ని కూడా బెట్టే వారి ఆటలు నాటితో ముగియనున్నాయనీ , ఉగ్రవాద సంస్థలు దొంగ నోట్ల పంపిణి చేస్తూ భారత ఆర్ధిక వ్యవస్థను పాడు చేస్తున్నాయనీ, ఈ నిర్ణయం తో ఆ కుట్రలను అరికట్టవచ్చునని, తద్ద్వారా ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చునని అయన దెశ ప్రజలకు పిలుపునిస్తూ ప్రసంగించారు.
ఆరంభం
అయితే 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 500 మరియు 1,000 రూపాయల బిల్లులు చెలామణిలో ఉన్న మొత్తం నగదులో సుమారు 86 శాతంగా ఉన్నాయి. 130 కోట్లు జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కువగా నగదు పైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి తోడు దేశంలోని మొత్తం లావాదేవీలలో 90-92 శాతం లావాదేవీలు నగదు రూపంలో చలామణి అవుతున్నాయి. అంతేకాక మరీ ముఖ్యంగా కార్మికులలో 85 శాతం వారి జీత భత్యాలు నగదు రూపంలోనే పొందుతున్నారు దేశ జనాభాలో సగం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు వుండడం గమనార్హం.దేశం మొత్తంలో వ్యవస్థీకృత ఉద్యోగులు తప్పా మరెవ్వరూ సకాలంలో పన్నులు చెల్లించేవారు కాదు. ఆదాయం చూపించేవారు కేవలం నలభై శాతం మాత్రమే. వీరిలో పది శాతం రైతులు.2016లో, కేవలం 3.7 కోట్ల భారతీయులు మాత్రమే పన్ను రిటర్న్‌లను దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అందులో 1కోటి మంది మినహాయింపు పొందారు. 130 కోట్ల జనాభా గల దేశంలో కేవలం 2. 7 కోట్ల చెల్లింపుదారులు ఉన్నట్లుగా అధికారికంగా తెలుస్తుంది.మరోపక్క…

2016 నవంబర్ 9 నుండి డిసెంబర్ 30 వరకు తమ వద్దనున్న రూ. 500 మరియు 1,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి సమయం ఇచ్చింది ప్రభుత్వం. బ్యాంకులలో వాటిని వాటి పూర్తి విలువకు డిపాజిట్ చేయవచ్చు లేదా కొత్త నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు అని తెలిపింది. కానీ ఒక వ్యక్తికి రోజుకు గరిష్టంగా 4,000 రూపాయలు మాత్రమే మార్చుకునే పరిమితిని పెట్టింది. కొంతకాలం ఆ పరిమితిని 4,500కి పెంచి తరువాత 2,000కు తగ్గించారు. ఈ నోట్ల మార్పు క్రమంలో ప్రజలు చాలా నలిగిపోయారు, కొంతమంది మరణించడం కూడా జరిగింది. దీనితో ఈ నిర్ణయం చాలా అనాలోచితమైన ప్రయోగమని పలువురు పేర్కొన్నారు.
కానీ మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం పన్ను ఎగవేతదారులుకు, వారి సంపదను ప్రకటించడం లేదా అన్నింటినీ కోల్పోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేయ్యాలనుకుంది.అలాగే వివరణ లేకుండా జరిగే పెద్ద పెద్ద డిపాజిట్లకు తక్షణ ఎరుపు జెండాగా ఉంటుంది అని ప్రజలను నమ్మించింది. కానీ జనవరి నెలాఖరుకు అవేవి జరగలేదు. ఆర్ బి ఐ లక్షల కొద్దీ కొత్త, బ్యాంక్ నోట్లను ఇంత తక్కువ సమయం లో సిద్ధం చేయలేకపోయింది.
[wpdiscuz-feedback id=”t2dsifxn47″ question=”మీ విశ్లేషణ ఏమిటి?” opened=”0″]అప్పటికి కేవలం కరెన్సీ మీదనే ఆధారపడి ప్రజలకు కేవలం రెండు నెలలలో మొత్తం నోట్లను మార్చకోవడం అసాధ్యమైంది. ఒకరకంగా విసిగెత్తిపోయారనే చెప్పాలి. కొత్త నోట్లు సరఫరా చాలా తక్కువలో ఉన్నందున, బ్యాంకుల వెలుపల పొడవైన లైన్లు ఏర్పడ్డాయి.[/wpdiscuz-feedback]

మరియు నెలల తరబడి ATMలు పని చెయ్యలేదు. పిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయి. రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల దాచుకొన్న డబ్బులు కాగితాలుగా మారిపోయాయని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీనితో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించడం మొదలుపెట్టారు. రోడ్లు మీదకొచ్చి ధర్నాలకు దిగారు. అనేక శాపనార్ధాలు పెట్టారు.దానికి వ్యతిరేకంగా వ్యాజ్యాలు, సమ్మెలు , నిరసనలు చేశారు.. మరోపక్క బీజేపీ వాదనతో ఏకీభవించి వారు దేశం కోసం త్యాగం చేసినట్లు భావించేవారు లేకపోలేదు.
ఇవి కూడా చదవండి: ట్విటర్, యూట్యూబ్‌లకు కేంద్రం సంచలన ఆదేశాలు..

[wpdiscuz-feedback id=”010erx3cw3″ question=”మీ కామెంట్ తెలుపగలరు ” opened=”0″]ప్రభుత్వం భావించినట్లుగా నోట్లరద్దు (Demonetisation) దేశానికి ఏమైనా మంచి చేసిందా?[/wpdiscuz-feedback]
రోజువారీ జీవితంలో ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ 2019 ఎన్నికల్లో భా.జ. పా ను అనూహ్యమైన మెజారిటీ తో గెలిపించారు. తిరిగి మోడీకే పట్టం కట్టారు. ఆనాడు డీమోనిటైజేషన్ (Demonetisation) వలన పడిన కష్టాలు మర్చిపోయారా ? లేదా ఈ నిర్ణయం భవిష్యత్తలో మంచి ఫలితాలను ఇస్తుందని భావించారా? ప్రజల మనోగతం ఏమిటి ?
డీమోనిటైజేషన్ (Demonetisation) లక్ష్యాలు నిరవేర్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ముందుకు రెండు విషయాల మీద చర్చించుకోవాలి.
- మొదటది – అనధికారిక, నల్ల ఆర్థిక వ్యవస్థను నిర్ములించడం.
- రెండవది – తీవ్రవాద నిధులను బలహీనపరిచేందుకు,
ఈ మొదటిది కొలవడం చాలా కష్టం. ఎందుకంటే నల్లధనం భారత దేశంలో కేవలం నోట్ల ద్వారానే కాక ఎక్కువగా బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ రూపంలో నిల్వ ఉంటుందని నిపుణులు అంగీకరిస్తున్నారు. 96.3% రద్దు చేసిన నోట్లు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా తరువాత కాలంలో మోడీ ప్రభుత్వం బంగారం నిల్వల మీద కూడా పరిమితులను విధించి నల్ల బాబులకు చెక్ పెట్టింది. డీమోనిటైజేషన్ వల్ల రికార్డు స్థాయిలో 9 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులను 2017 లో జోడించిన మాట కూడా వాస్తవమే. ఆ నాటి నుండి డిజిటల్ చెల్లింపులు వినియోగం గణనీయమైన పెరుగుదలను చూసింది,.. ఈ ఎనిమిది సంవత్సరాలలో 85 శాతం చెల్లింపులు డిజిటల్ రూపంలోనే జరుగుతుండడం మనం చూస్తున్నాం.
ఇక రెండవది..అతి ముఖ్యమైనది
నోట్ల రద్దు ఫలితంగా తీవ్రవాద గ్రూపులు ఏవైనా గణనీయమైన నష్టాలను చవిచూసాయా ? తెలియదు… కానీ… భారత దేశంలో తీవ్రవాదంను ప్రోత్సహించింది మన పక్కదేశం అయిన పాకిస్థాన్. మరి ఈ గడిచిన ఆరు సంవత్సరాలలో పాకిస్థాన్ ఆర్ధిక తీరును విశ్లేషిద్దాం…
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి పరోక్షంగా భారతే కారణమా..
ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ పతనమైతే ఆ దేశ ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించాలో? ఎంత దుర్భర జీవితం గడపాలో పాకిస్థాన్‌లో పరిస్థితులు చూపిస్తున్నాయి. కరెంట్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఆ క్రమంలో పెరిగిపోయే దోపిడీలు. ఇలా పాకిస్థాన్ లో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. లక్షలాది కుటుంబాలు రోజుకు ఒక పూట ఆహారంతోనే బతకాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఖాళీ కడుపుతో చిన్నారులు అల్లాడుతున్నారు. వేలాదిమంది కూలీలు పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక దుస్థితే పాక్‌లో దర్శనమిస్తోంది. పాక్‌లో ఆ పరిస్థితికి భారత్‌లో ప్రధాని మోడీ అమలుపరిచిన డిమోనిటైజేషన్ లింకేమిటి ?
గత ఏడాది భారీ వరదలు సంభవించి, దాని నుంచి కోలుకోకముందే మరో సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది పాకిస్థాన్. ఆర్థిక మాంద్యంతో పాక్ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయిందని. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో దేశం దివాళా తీసే స్థాయికి వెళ్లిపోయిందని అంటున్నారు.
ప్రస్తుతం పాక్ లో కరెంట్,ఆహారం, ఇంధనం, డబ్బుకు తీవ్ర కొరత ఏర్పడింది. కరెంట్ లేక ఆ దేశం చీకట్లలో మగ్గుతోంది. విద్యుత్ ను ఆదా చేసేందుకు షాపులు, షాపింగ్ మాళ్లను రాత్రి 8.30కే మూసేయాలని, రెస్టారెంట్లను రాత్రి 10 గంటల లోపు కట్టేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్ వాడకాన్ని 30 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్‌లో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి. నిరుడు జనవరిలో 16.6 బిలియన్ డాలర్లున్న ఆ దేశ విదేశీ మారక నిల్వలు.. ఇప్పుడు 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయంటేనే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పెట్రోల్, డీజిల్‌పై పాకిస్థాన్ ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడడం, వాటి ధరలు విపరీతంగా పెరగడం, పాకిస్థాన్ రూపీ విలువ పతనమవ్వడం వంటి కారణాలు డాలర్ నిల్వలు తరిగిపోవడానికి కారణమైందంటున్నారు. ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
ఇక ఆ దేశంలో గోధుమలు, కూరగాయలు ఇతర తిండి వస్తువుల ధరలు ఆకాశాన్నంటేశాయి. తిండి గింజలకు కొరత ఏర్పడింది. గోధుమ పిండి కోసం వీధుల్లో జనం ఎగబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆ గొడవల్లో నలుగురు చనిపోయారు. ఇప్పటికీ దుకాణాల ముందు నిత్యావసరాల కోసం జనం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్థిక సంక్షోభం ముంగిట ఆ దేశం ఇటు ఎంబసీలనూ మూసేస్తోంది. ఈ పరిస్థితుల నుంచి జనాన్ని బయట పడేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన జెనీవాలో జరిగిన ఓ సదస్సులో విదేశాల సాయం కోసం అర్థించారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి రావాల్సిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ నిధుల కోసం పాక్ అధికారులు ఐఎంఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. వాస్తవానికి 6 బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ కోసం 2019లోనే ఒప్పందం కుదరగా.. దానిని ఆ తర్వాత 7 బిలియన్ డాలర్లకు పెంచారు. అయితే, నిరుడు నవంబర్‌లో పాక్‌కు 1.18 బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ను ఐఎంఎఫ్ ఇవ్వలేదు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు పన్నులు, కరెంట్ చార్జీలు, ఎక్స్చేంజ్ రేట్‌పై కృత్రిమ నియంత్రణ వంటి చర్యలకు పాక్ అంగీకరించకపోవడంతోనే ఐఎంఎఫ్ ఆ నిధులను ఆపేసింది.
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకునేందుకు నిర్ణయించింది. అంతేగాకుండా పాక్ స్టేట్‌బ్యాంక్‌లో సౌదీ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ నిధులను 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు స్టడీ చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ఫలిస్తే పాక్‌కు అంతో ఇంతో ఊరట ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాబోయే మరికొన్ని నెలలు పాకిస్థాన్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా.
కష్టాలు ఎక్కడ మొదలయ్యాయి?
ఆ దేశం ఆర్ధిక స్థితి తెలియజేసే సూచికలలో ఒకటి దాని కరెన్సీని చూడటం మరియు అనేక సంవత్సరాలుగా కరెన్సీ ఎలా పని చేస్తోంది అన్న దాని బట్టి మనం అంచనా వెయ్యగుతాం . ఒక్కసారి పాకిస్తాన్ కరెన్సీని ఈ కింది చిత్రంలో పరిశీలీద్దాం.
గత 10 సంవత్సరాల పాకిస్థాన్ కరెన్సీ విలువను పోల్చి చూస్తే 2016 చివరిలో, 2017 ప్రారంభంలో తగ్గుదల ప్రారంభమయి ఒక స్థిరమైన క్షీణతదిశగా ప్రయాణించింది. అంతకు ముందు పెరిగిన పాకిస్థాన్ కరెన్సీ 2016 నవంబర్ నుండే క్షీణీస్తూ వచ్చింది.. దానికి కారణాలు విశ్లేషించుకుందాం
ఇది యాదృచ్చికం కాదు.
నోట్ల రద్దు (Demonetisation) అనేది పాకిస్తానీ కరెన్సీ క్షీణత ప్రారంభానికి సరిగ్గా సరిపోయే సమయం. అత్యధికంగా నకిలీ నోట్లను ముద్రించి మన దేశ సరిహద్దులు దాటిస్తోంది పాక్. అంతేకాక భారతీయ మార్కెట్‌లోకి మరియు గ్లోబల్ మార్కెట్‌లోకి వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్నారని తెలుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది. మరియు పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సంవత్సరానికి బిలియన్ల డాలర్లను సంపాదించిపెడుతోంది. ఇది భారతదేశా అర్ధిక వ్యవస్థకి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇది పాకిస్తాన్ భారత్ పై తమ విజయంగా భావిస్తుంది. మూడు దశాబ్దాలుగా గత భారత ప్రభుత్వాలు దీని గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీనికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసున్న సంధర్భాలు కూడా లేదు.
పాకిస్థాన్‌లో ఈ దుస్థితికి మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (Demonetisation) నిర్ణయం తీసుకోవడమే. మోడీ నిర్ణయానికి పాక్ దుస్థితికి లింక్ ఏంటంటారా? అక్కడే ఉంది అసలు లాజిక్… పెద్ద నోట్లరద్దుకు (Demonetisation) ముందు పాకిస్థాన్ నుంచి యథేచ్చగా మన దేశంలో దొంగనోట్ల చలామణి ఉండేది. అయితే సడన్‌గా దానికి బ్రేక్ పడటంతో పాక్‌కు ఊపిరి సలపకుండా పోయిందంటున్నారు. ఇక భారత్ ప్రభుత్వ ఉక్కుపాదంతో దేశంలో ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయి. దాంతో కొత్త నోట్లను చలామణి చేద్దామని పాక్ టెర్రరిస్టులు భావించినా ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానమంత్రి మోడీ భారతీయ కరెన్సీ మొత్తాన్ని విలువ లేకుండా చేసే ఈ అసాధారణమైన కఠినమైన చర్యతో ముందుకు సాగారు.

పాకిస్తానీ రూపాయిల క్షీణత 8 నవంబర్ 2016 తర్వాత మాత్రమే ప్రారంభమయింది. మరియు భారతదేశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేసిన, భారత ప్రధాన శత్రువు పాకిస్థాన్ పై భారత్ అనూహ్యమైన విజయం సాధించింది…
మరి భరత్ మాటేమిటి?
[wpdiscuz-feedback id=”5inn5xn3pg” question=”మీ కామెంట్ తెలుపగలరు ” opened=”0″]ఒక వైపు పాకిస్థాన్ విదేశాల సాయం కోసం అర్రులు చేస్తున్న సందర్భంలో, భరత్ ఆపరేషన్ దోస్త్ రూపేణా పొరుగుదేశాలైన టర్కీ ఇసిరియాల్ కు యుద్ధప్రాతిపదికన “ఆపరేషన్ దోస్త్” అంటూ సహాయం చెయ్యగలుగుతోంది… అంతే కాకుండా మన దేశంలో అమృత్ బడ్జెట్ ప్రెవేశపెట్టిం అభివృద్ధికి పెద్ద పీత వేసింది… దీనికి తోడు అనూహ్యంగా ఆఫ్గానిస్థాన్ కు 200 కోట్లు డెవలప్మెంట్ ఎయిడ్ ను ప్రకటించింది… తద్వారా దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తూ ఆసియలో పెద్దన్న స్థాయికి ఎదుగుతుండడం మనం చూస్తున్నాము.[/wpdiscuz-feedback]
ఏదేమైనా యుద్దం చేయకుండానే దాయాది దేశాన్ని మోడీ సర్కారు కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది కదూ… కాబట్టి ఇది గొప్ప విజయం అని నేను చెబుతాను.