- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.
- అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండి.
- ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఫలుమార్లు స్పష్టం చేసింది.
- నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా అమరావతిని రాజధానిగా అంగీకరించారు.
- ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది.
- 3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
- ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 3 రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
- అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండి.
– రామకృష్ణ.