అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు .16 న నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో ఓటర్లను ప్రేరేపించేలా ప్రవర్తించకూడదన్నారు. కొత్త పనులు, పథకాలు ప్రకటించకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.