- బ్రాహ్మణపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం!
బెళుగుప్ప మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు శుక్రవారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాఠశాల సమయంలో ముగ్గురు చిన్నారులకు చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇద్దరు చిన్నారులు బయట ఉండగా మూడో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నం చేసినట్లు సమాచారం. బాలికకు రక్త స్రావం కావడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం కళ్యాణదుర్గం తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలింపు బాధిత చిన్నారి వివరాల మేరకు యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారిని అమ్మమ్మ వద్ద వదిలి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.