- చంద్రబాబు సభలకు లభిస్తున్న ప్రజాదరణతో జగన్ రెడ్డిలో ఓటమిభయం మొదలైంది. ఆ ఓటమి తాలూకా అహం నుంచి పుట్టిందే జీవోనెం-01. ప్రతిపక్షనేత సభల్లో కనిపించని పోలీసులు, చీకటిజీవో పేరుతో అడ్డుకోవడానికి మాత్రం ముందుంటున్నారు.
- కుప్పంలో చంద్రబాబుని అడ్డుకున్న డీజీపీకి, వైసీపీకి జీవోనెం-01 వర్తిస్తుందన్న సజ్జలకు నందిగామలో వైసీపీఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ర్యాలీ కనిపించలేదా?
- 40లక్షల మంది పసుపుసైన్యం రోడ్లపైకి వస్తే ఈ పోలీసులేం చేస్తారు? : అశోక్ బాబు.
- చంద్రబాబుకి లభిస్తున్న ప్రజామద్ధతు చూసి, ముఖ్యమంత్రికి పిచ్చిపట్టింది : మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ.
- ప్రజాస్వామ్య పరిరక్షణకై జరిగే పోరాటంలో, చివరకు జగన్ రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం : రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బీ.రామ్ భూపాల్ రెడ్డి
చంద్రబాబునాయుడి సభలు, సమావేశాలకు వస్తున్న ప్రజాదరణ ముందు తన బటన్ నొక్కుళ్లు పనిచేయవన్న సత్యం ముఖ్యమంత్రికి బోధపడిందని, దాంతో ఆయనలోని అహం నుంచే చీకటిజీవో నెం-01 వచ్చిందని, నియంత్రత్వపోకడలు, పోలీస్ కవాతుతో ప్రజాగ్రహాన్ని ఆపాలనుకోవడం ముఖ్యమంత్రి ఫాసిస్ట్ పాలనకు నిదర్శమని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన, మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్. రామకృష్ణ, రాయలసీమ పట్టభద్రులఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ భూపాల్ రెడ్డిలతో కలిసి విలేకరు లతో మాట్లాడారు.
బటన్ నొక్కుడు పేరుతో జగన్ రెడ్డి తమపీక నొక్కుతున్నాడని జనానికి అర్థమైంది. ప్రజలకు వాస్తవాలు అర్థమవ్వబట్టే చంద్రబాబుని ఆదరిస్తున్నారు. చంద్రబాబుకి లభిస్తున్న ప్రజాభి మానంతో తనకు ఓటమితప్పదని జగన్ రెడ్డికి అర్థమైంది. ఆ ఓటమితాలూకా భయం, అహం నుంచి పుట్టిందే ఆయన తీసుకొచ్చిన చీకటిజీవోనెం-01.భద్రతాచర్యలు చేపట్టడానికి రాని పోలీసులు, చీకటిజీవోపేరుతో అడ్డుకోవడదానికి మాత్రం ముందుంటున్నారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం జీవో తెచ్చామంటున్నారు. అసలు ఆ చట్టానికి ఉన్న విశ్వసనీయత, చట్టబద్ధత ఏమిటో ప్రభుత్వంచెప్పాలి. చంద్రబాబు సభలు, సమావేశాలు అడ్డుకోవడానికి వందలాదిగా వస్తున్నపోలీసులు, ప్రజల్ని నియంత్రించడానికి, భద్రతాచర్యలు చేపట్టడానికి మాత్రం ముందుకు రావడంలేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు బయటకు వచ్చినా 1500 నుంచి 2వేల మంది పోలీస్ పహారాతో వస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ప్రతిపక్షనేత సభలకు వచ్చేవేలాది జనాన్ని నియంత్రించడానికి, భద్రతాచర్యలకోసం ఎంతమంది పోలీసు ల్ని పంపాలో తెలియదా? కందుకూరు, గుంటూరు దుర్ఘటనలు రెండూకూడా ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ చేతగానితనం వల్లే జరిగాయి. ప్రతిపక్షనేతను అడ్డుకోవడానికే ఆరెండు దుర్ఘటనల్ని జగన్ రెడ్డి సాకుగా చూపుతున్నాడు.
Contents
డీజీపీకి నందిగామలో వైసీపీ ఎమ్మెల్సీ ర్యాలీ కనిపించలేదా?
టీడీపీసభలు సమావేశాలు రోడ్లపై పెట్టకూడదనే ప్రభుత్వం, వైసీపీనేతల సభలు, సమావే శాలు, ర్యాలీలు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి. నందిగామ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నేడు ర్యాలీ ఎక్కడ చేశాడో డీజీపీ చెప్పాలి? అరుణ్ కుమార్ ప్రైవేట్ రోడ్లపై తిరిగాడా? అతని ర్యాలీ, ఊరేగింపుని ఎలా జరగనిచ్చారు? డీజీపీ వైసీపీకి బానిసలా కాకుండా ఐపీఎస్ లా ప్రవర్తిస్తే మంచిది. జీవోనెం-01 వైసీపీకి వర్తిస్తుందని సజ్జల అంటున్నాడు. మరి నేడు వైసీపీఎమ్మెల్సీ విచ్చలవిడిగా రోడ్లపై ఎలా తిరిగాడో ఆయనే చెప్పాలి
చట్టాన్ని గౌరవించినంత కాలమే మేం పోలీసుల్ని గౌరవిస్తాం.
కుప్పంలో చంద్రబాబుగారు పర్యటిస్తుంటే, రాష్ట్రంలో మిగతాచోట్ల టీడీపీనేతల్ని ఎందుకు గృహనిర్బంధాలు చేశారు? గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీనేతల్ని ఎందుకు అకారణంగా అరెస్ట్ చేశారు? ఈరోజు నాయకుల్ని ఆపారు.. రేపు 40లక్షల టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వంచేతిలో ఉన్న పోలీస్ ఫోర్స్ ఎంత? మా కార్యకర్తలు ఎంతమందో ఆలోచించుకోండి. యూనిఫామ్ వేసుకొని అరాచకం చేద్దామనుకుంటున్నారేమో..మేం సహనంతో ఉండబట్టే మీరు ఇష్టమొచ్చినట్టు చేయగలుగుతున్నారు? ఏ అధికారంతో పోలీసులు టీడీపీ కేంద్రకార్యాలయం ముందు ముళ్లతీగలు వేశారు. బారికేడ్లు, వాహనాలు అడ్డుపెట్టారు? చట్టాన్ని గౌరవించినంతకాలమే మేం పోలీసుల్ని గౌరవిస్తాం. ఇలాంటి చర్యలతో తనపని అయిపోయిందని జగన్ రెడ్డే ఒప్పుకున్నాడు.
జగన్ అణువణులో చంద్రబాబుతాలూకా భయమే….
జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా, చంద్రబాబుని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాడు. కారణం అతనిలో మొదలైభయం.. జగన్ అణువణువులో చంద్రబాబుతాలూకా భయం నిండిపోయింది. ప్రతిసభలో, ప్రతిసమావేశంలో జగన్ రెడ్డి చంద్రబాబు నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాడు. జీవోనెం-01అయినా, జీవో-10 అయినా ముఖ్యమంత్రి జనాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయం. గుంటూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 10వేల మంది వస్తారని, అందుకు తగినట్టుగా భద్రత కల్పించాలని తాము పోలీసుల్ని కోరితే, కనీసం 150మంది కూడా పోలీసులు లేరు. జరిగిన దుర్ఘటన ప్రభుత్వవైఫల్యం వల్ల జరిగిందే. నింద మాత్రం టీడీపీపై, చంద్రబాబుపై వేస్తున్నారు. టీడీపీనేతలు జనంలోఉంటూ, జగన్ రెడ్డి వైఫల్యాలు ఎత్తిచూపుతున్నారన్న భయంతోనే ఈ ప్రభుత్వం జీవోనెం-01 తెచ్చిందని రోజా తెలుసుకోవాలి. మీప్రభుత్వం పళ్లు ప్రజలు ఊడగొట్టేరోజు దగ్గరికొచ్చింది రోజా. అందుకే మీరు, మీ నాయకుడు ప్రతిపక్షనేతనిచూసి పళ్లుకొరుక్కుంటూ, పడరానిపాట్లు పడుతున్నారు.
చంద్రబాబుకి లభిస్తున్న ప్రజామద్ధతు చూసి, ముఖ్యమంత్రికి పిచ్చిపట్టింది– మాజీ ఎమ్మెల్సీ, ఏ.ఎస్.రామకృష్ణ.
కందుకూరు దుర్ఘటన, గుంటూరు తొక్కిసలాటను సాకుగాచూపి జగన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోనెం-01 ముమ్మాటికీ చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి తెచ్చిందే. తన సభలు, సమావేశాల నుంచి జనం పారిపోతుండటంతో ఈ పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి, ఈర్ష్యా ద్వేషాలు పతాకస్థాయికి చేరాయి. తనసభలనుంచి ప్రజలు పారిపోకుండా ఉండటానికి జగన్ రెడ్డి ఏకంగా కందకాలే తవ్విస్తున్నాడు. భవిష్యత్ లో ఆ కందకాల్లో పాములు, తేళ్లు వేసినా ఆశ్చర్యంలేదు. ఈ పిచ్చిముఖ్యమంత్రి తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు. నిరక్ష్యరాస్యత అనే పదం పలకలేకపోవడమేనా ఆయన ఫస్ట్ క్లాస్? వైసీపీప్రభుత్వ మాఫియాలదెబ్బకు ఇప్పటికే జనం బతుకులు రోడ్డునపడ్డాయి. మద్యం, ఇసుక, మైనింగ్, భూ మాఫియాలు, వాటికి తోడు డ్రగ్స్ మాఫియా ఆగడాలతో రాష్ట్రం సర్వనాశనమైంది. మూడురాజధానులంటూ పిచ్చికూతలుకూసి, జనంలో పరువుపోగోట్టుకున్నాడు. ఏదోగ్రహం నుంచి వచ్చిన వింతజంతువు తమను పాలిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి పిచ్చిచేష్టలు చూసి, ఏదో గ్రహం నుంచివచ్చిన వింతజంతువు రాష్ట్రాన్ని, తమను పరిపాలిస్తోందని ప్రజలంతా అనుకుంటున్నారు. జీవోనెం-01తో రోడ్లపై మీటింగ్ లుపెట్టకూడదు, ప్రతిపక్షనేతలు తిరగకూడదు అంటున్నాడు. భవిష్యత్ లో ఈనాడు, ఆంధ్ర జ్యోతి చదవకూడదు.. టీవీ5, ఏబీఎన్ చూడకూడదని జీవోలు తెచ్చినా తెస్తాడు. చంద్రబా బుకి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని జగన్ రెడ్డి, కుళ్లు, కుత్సితంతోనే జీవోనెం-01 తీసుకొచ్చాడు. ఆ జీవో వైసీపీకి వర్తించదు. చంద్రబాబుకి, టీడీపీవారికే వర్తిస్తుందా? అత్యంత బలహీనుడైన ముఖ్యమంత్రి తాను అత్యంత బలవంతుడిని అని భావించి తెచ్చిన ఆ జీవోని ఎవరూ ఖాతరుచేయరు.ఏ వైద్యుడు నయంచేయలేనంత పిచ్చిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. 2024లో చంద్రబాబే రాష్ట్రముఖ్యమంత్రి అని ప్రజలు తీర్మానించుకున్నారు. దాంతో జగన్ రెడ్డి చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అది తెలిసే జగన్ రెడ్డి వింతైన రోగంతో మంచమెక్కి, ఇంకా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. చివరకు ప్రపంచంలో ఏవైద్యుడు నయంచేయలేనంత పిచ్చివాడిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. పోలీసుల సాయంతో తెలుగుదేశాన్ని అణచాలని, 2024లో చంద్రబాబుని ముఖ్యమంత్రి కాకుండా చేయాల న్న జగన్ రెడ్డి ప్రయత్నాలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. ప్రతిపక్షాలు, ప్రజలకు ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కుల్ని కాలరాసే చర్యల్ని జగన్ రెడ్డి తక్షణమే విరమించుకోవాలి.
జగన్ రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం- బీ.రామ్ భూపాల్ రెడ్డి
చంద్రబాబుకి లభిస్తున్న ప్రజామద్ధతు నుంచి పుట్టిందే జగన్ రెడ్డి తెచ్చిన చీకటి జీవోనెం-01. నియంత్రత్వపోకడలు పోయిన నియంతల చరిత్ర జగన్ రెడ్డి మర్చిపోతే, అదే చరిత్రలో ఆయన కలిసిపోవడం ఖాయం. స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడానికి తెల్లవారు అనేక చీకటిజీవోలు తెచ్చి, చివరకు దేశం విడిచిపోయారు. ప్రజాస్వామ్య పరిరక్షణార్థం జరిగే పోరాటంలో జగన్ రెడ్డికూడా చివరకు రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం. ప్రజలపై ఆంక్షలు, ప్రతిపక్షనేతపై నిర్బంధాలు జగన్ రెడ్డి పీఠాన్నే కదిలిస్తాయి. ప్రజల్లో చైతన్యం వస్తే తాడేపల్లి ప్యాలెస్ మట్టలో కలిసిపోతుందనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహిస్తే మంచిది. జగన్ రెడ్డి నిర్వహించిన రాయలసీమ గర్జన, ఉత్తరాంధ్ర గర్జన రెండూ తుస్సుమన్నాయి. దాంతో ఇప్పుడు పోలీసుల అండతో ప్రతిపక్షాలు, ప్రజలపై గర్జిస్తున్నాడు. జగన్ రెడ్డి సీమకు చేస్తున్న ద్రోహాన్ని రాయలసీమవాసులు కనిపెట్టారు. 5వ తేదీ వచ్చినా పెన్షనర్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, వేధింపులు, దాడులు, దౌర్జన్యాల్లో మాత్రం ముందుం టున్నాడు.