XBB.1.5…. ఇప్పుడి పదం ప్రప
తెలుగు రాష్ట్రాలకు భారీ అలర్ట్. అత్యంత ప్రమాదకరమైన కరోనా వేరియంట్ తెలంగాణలో ప్రవేశించింది. చైనా, యూఎస్‌లో మరణమృదంగం మోగిస్తున్న డేంజరస్ XBB.1.5 వేరియంట్ ఇదే.
చైనా సహా ప్రపంచదేశాల్ని కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. ఈ క్రమంలో చైనా, అమెరికాలో రెండు ప్రదాన వేరియంట్లు కారణంగా ఉన్నాయి. ఒకటి బీఎఫ్.7 కాగా రెండవది XBB.1.5వేరియంట్. బీఎఫ్.7తో పోలిస్తే..XBB.1.5 చాలా చాలా ప్రమాదకరం. అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. మరణాల రేటు కూడా ఈ వేరియంట్‌తో ఎక్కువ. అమెరికాలో అత్యదిక ప్రమాదకరంగా మారింది ఈ వేరియంట్‌నే.
ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే ఒమిక్రాన్ బీక్యూ.1తో పోలిస్తే 120 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. అటు సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే 5 రెట్లు ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరించిన పరిస్థితి.
ఈప్రమాదకర XBB.1.5 వేరియంట్ దేశంలో ఇప్పటికే గుజరాత్‌లో ప్రవేశించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో తొలి కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓ కేసు నమోదైంది. ఇప్పటి వరకూ XBB.1.5 వేరియంట్ కేసులు గుజరాత్‌లో 3, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో తొలి కేసు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. కారణం అత్యంత వేగంగా వ్యాపించడమే.