ఎన్నికల ముందు కే సి ఆర్ కొత్త స్కీం
తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ … కొత్త స్కీంలు ప్రకటిస్తారని …. తాజా బడ్జెట్ లోనే పలు కొత్త పథకాలను తీసుకొస్తారని భావించారు … కానీ పాత వాటికే నిధులు కేటాయించారు. దాతో బడ్జెట్ పాతచింతకాయ పచ్చడిలా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .. తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి … బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత కేసీఆర్ ఎన్నికల హడావుడి మొదలు పెడ్తారని అందరూ అనుకుంటున్నారు … ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధినేత … సరిగ్గా టైం చూసుకుని కొత్త స్కీం ప్రవేశపెడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ..
2018 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ బడ్జెట్ లో ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదు …. కానీ ఎన్నికల ముందు ‘రైతు బంధు’ను తీసుకొచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చారు .. ఆ పథకమే మరోసారి అధికారంలోకి రావడానికి ప్లస్ అయిందన్న అభిప్రాయం ఉంది … తాజా బడ్జెట్‌లోనూ కొత్త స్కీంలు ప్రకటిస్తారని …. పలు కొత్త పథకాలను తీసుకొస్తారని భావించారు … కానీ పాత వాటికే నిధులు కేటాయించారు… అయితే కొత్తగా ఏమీ ప్రకటించలేదు … ఇప్పుడు కూడా బడ్జెట్ లో కాకుండా ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలను ఆకట్టుకునేలా కొత్త పథకాన్ని తీసుకొస్తారనే చర్చ సాగుతోంది.
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేశారు …. త్వరలో రైతుల కోసం దేశం అశ్యర్యపోయే సరికొత్త పథకాన్ని తీసుకొస్తానని … వారంలో రోజుల్లోనే రైతులు తీపి కబురు వింటారని అన్నారు … కానీ నెలలు దాటినా ఆ పథకం గురించి బయటపెట్టలేదు. … అయితే దాన్ని వచ్చే ఎన్నికల ముందు ప్రకటిస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఈ స్కీం ఉపయోగపడుతుందని అంటున్నారు.
2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ ‘రైతు బంధు’ ను ప్రకటించారు … ఆ తరువాత ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో పెట్టుబడి మొత్తాన్ని అందిస్తున్నారు …. దీంతో రైతుబంధు విషయంలో కేసీఆర్ పై రైతులకు నమ్మకం ఏర్పడింది … అలాగే ఇప్పుడు రైతులకు పెన్షన్ కూడా అందించాలని చూస్తున్నారట … రైతు ప్రయోజనాలే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చాటి చెబుతుందని చెప్పడానికి ఈ పథకాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఆసరా పింఛన్ మాదిరిలాగే.. రైతులకు కూడా నెలనెల పింఛన్ ఇచ్చే విధంగా రూప కల్పన చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి
ఈ పథకం తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికే కాకుండా … జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది … ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు సందర్భంగా ..అబ్ కీ బార్ కిసాన్ సర్కార్… అనే నినాదం ఇచ్చారు … దీంతో తాము రైతుల కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు… ఈ స్కీంతో తెలంగాణలో సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా ఇదే నినాదంతో వచ్చే ఎన్నికల్లోకి వెళ్లాలన్నది గులాబీ బాస్ ఆలోచన అంటున్నారు
అయితే రైతుబంధు, రైతుబీమాలు సక్సెస్ అయినా.. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. రైతులకు ఉచితంగా వీటిని సరఫరా చేస్తే పెద్దగా భారంపడే అవకాశం లేదు … అయితే ఈ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు రైతులకు పెన్షన్ ను ప్రకటించడం ద్వారా రైతుల ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని అంటున్నారు … మరి బిఆర్ఎస్ అధినేత వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి…