- కడప జిల్లా రైతులకు బిందుతుంపర సేద్యం పరికరాలు అందించలేని జగన్ రెడ్డి, రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దరిస్తాడా?-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు)
- “టీడీపీ స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలో రైతుసమస్యలపై చర్చించింది. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మూతపడింది.
- బడ్జెట్ లో కేటాయించిన మొత్తంనిధుల్లో 10, 15 శాతం హెచ్చుతగ్గులు ఉండటం సహజం.
- కానీ వ్యవసాయశాఖకు 2020-21లో రూ.20వేలకోట్లు కేటాయించి, రూ.7వేల కోట్లు ఖర్చుచేసినప్పుడే జగన్ రెడ్డికి రాష్ట్ర రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమైంది.
- ఇంకా దారుణం ఏమిటంటే ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటఉత్పత్తులు అమ్ముకునే విషయంలోకూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్) నివేదిక ప్రకారం ఏపీలోని ధాన్యం రైతులు క్వింటాల్ కు 11శాతం (రూ.213) నష్టపోయారని నివేదిక చెప్పింది.దాని ప్రకారం వరి పండించిన రైతాంగం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపు రూ.60వేలకోట్లు నష్టపోయారు.
- నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు క్వింటాకు రూ.400 నష్టపోయారు. ధాన్యం కొన్న 6, 7 నెలలకు రైతులకు డబ్బులిచ్చారు.
- అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇంతభారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
- గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకున్నవారు లేరు. వ్యవసాయమంత్రి సీబీఐ భయంతో దాక్కున్నాడు.
- తెలంగాణలో మొదటి పంటకు 70లక్షల టన్నులు కొన్నారు.అక్కడ రూ మూడోరోజునే రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
- ఏపీలో ఈ సంవత్సరం ఖరీఫ్ లో 90లక్షల టన్నులు దిగుబడి వస్తే, కొనుగోలు లక్ష్యం మాత్రం 33 లక్షల టన్నులే ఎందుకు పెట్టారు? కేవలం 29 లక్షల టన్నులే ఎందుకు కొన్నారు?
- పక్క రాష్ట్రంలో 70లక్షల టన్నులు కొంటే, ఏపీలో 29లక్షల టన్నులే కొంటారా?
- రాష్ట్రంలో కౌలురైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రాప్ బుకింగ్ పేరుతో కౌలురైతుల గొంతులు కోస్తున్నారు.
- జాతీయస్థాయిలో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ ఎందుకు నిలిపేశారు?
- 5 ఎకరాలకు 70శాతం సబ్సిడీ ఉంటే, చంద్రబాబు దాన్ని 10ఎకరాలకు పెంచి 90శాతం సబ్సిడీ అందించారు. 2018లో మైక్రో ఇరిగేషన్ లో ఏపీ నంబర్ 1 గా నిలిచింది.
- గతంలో కడప రైతులు చంద్రబాబు అందించిన బిందుతుంపర సేద్యంతో అద్భుతాలు సృష్టించామని, అవే పరికరాలు అందించాలని వ్యవసాయమంత్రిగా ఉన్న కన్నబాబుని అడిగితే, ఆయన దానిగురించి ముఖ్యమంత్రికి చెబితే, నవరత్నాలు గురించి తప్ప, ఇంకోదాని గురించి మాట్లాడవద్దంటూ జగన్ రెడ్డి, కన్నబాబుపై అసహనం వ్యక్తంచేసింది నిజంకాదా? దాంతో మంత్రిగా ఉన్నకన్నబాబు రైతులకు ఏమీచెప్పలేక తాను నిస్సహాయుడిని అంటూ చేతులెత్తేశాడు.
- సొంత జిల్లా రైతులకే న్యాయంచేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి ఆలోచిస్తాడా?
- చంద్రబాబు మైక్రో న్యూట్రియంట్స్ ను ఉచితంగా అందిస్తే, జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఆపేసింది.
- అలానే సోలార్ పంప్ సెట్స్, ఐఎస్ఐ మార్క్ మోటార్స్ ఫ్రీగా అందించాము వాటినికూడా ఆపేశారు.యాంత్రీకరణ పధకం కింద చంద్రబాబు గారు 2018 వ సంవత్సరంలో 650 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా యాంత్రీకరణకు ఖర్చు పెట్టలేని దుస్థితి.
- ఇన్ పుట్ సబ్సిడీని కేంద్రప్రభుత్వం ఎన్.డీ.ఆర్.ఎఫ్ నిబంధనలప్రకారం నిర్ణయిస్తే, దానికి అదనంగా టీడీపీప్రభుత్వం అందించింది. హెక్టార్ వరి సేద్యానికి రూ.15వేలుంటే, దాన్ని రూ.20వేలు చేశాము.
- టీడీపీహాయాంలో ఎకరావరి సాగుకి రూ.18 నుంచి రూ.20వేలు పెట్టుబడి అయితే, ఇప్పుడు రూ.30 నుంచి రూ.35వేలు పెట్టుబడి అవుతోంది.
- టీడీపీప్రభుత్వం రైతులకు అమలుచేసిన పథకాలన్నీ తీసేస్తారా?
- రాష్ట్రం విడిపోయి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా లెక్కచేయకుండా టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి రూ.60వేలకోట్లు ఖర్చుచేసింది.
- ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి కేవలం రూ.19వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టి, ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేశాడు.
- మంత్రుల కమిటీ వేసి ఆక్వారంగాన్ని కుప్పకూల్చారు. ఆక్వారైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
- మైక్రో ఇరిగేషన్, యంత్రపరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంట.. రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి మాత్రం వేలకోట్లు ఖర్చుచేస్తారంట?
- రైతులు తిరగబడి, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
- మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకంటే పెద్ద రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువున్నాయి కాబట్టి ఏపీ మూడోస్థానంలో ఉందంటున్నారు.
- రైతుల సంఖ్య ప్రకారం చూస్తే, రైతు ఆత్మహత్యల్లో ఏపీదే తొలిస్థానం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రానిది రెండోస్థానం.
- సీబీఐ కేసుల్లో మునిగిన వ్యవసాయమంత్రికి రైతుల గురించి పట్టించుకునే తీరిక లేదు.
- ఈ విధంగా రైతుల వేదన, వ్యవసాయరంగ దుస్థితిపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. దాన్నే మీడియాకు కూడా ఇస్తున్నాం.
రాజధాని విషయంలో జగన్ రెడ్డి పచ్చిమోసగాడని నిరూపితమైంది.
- రాజధాని విషయంలో జగన్ రెడ్డి మరోసారి పచ్చిమోసగాడని నిరూపించుకున్నాడు.
- ప్రతిపక్షనేతగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక భూములిచ్చిన రైతుల ఉసురు పోసుకునేలా వ్యవహరిస్తున్నాడు.
- రాజధాని అంశం కోర్టులో విచారణలో ఉండగా, జగన్ రెడ్డి ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పెట్టుబడులు పెట్టడానికి విశాఖకు రావాలని, విశాఖే రాజధాని అని పారిశ్రామికవేత్తలకు చెప్పడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అవుతుంది.
- జగన్ రెడ్డి నియంత పాలన ఎన్నోరోజులు సాగదు. ప్రజల ఆమోదంతో పనిలేకుండా ప్రతిసారి జగన్ రెడ్డి మాటతప్పి, మడమతిప్పుతూనే ఉన్నాడు.