- నల్లి, గులాబి పురుగుతో నష్టపోయిన రైతులతో ఫిబ్రవరి 2న రచ్చబండ నిర్వహిస్తాం-మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు)
- రాష్ట్ర వ్యవసాయరంగం ముందున్న సవాళ్లను టీడీపీ స్టీరింగ్ కమిటీ చర్చించింది.
- రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా రైతులతో చర్చించి ప్రణాళికలు తయారుచేశాము.
- జగన్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అవమానిస్తోంది.
- రైతుల భూముల పత్రాలపై తనబొమ్మలు వేయడం, హద్దురాళ్లపై తనచిత్రాలు వేయాలన్న నిర్ణయాన్ని జగన్ వెనక్కు తీసుకోవాలి.
- భూసర్వే పేరుతో జగన్ ప్రభుత్వంలోని బ్రోకర్లు రైతులభూములు కొట్టేయడానికి సిద్ధమయ్యారు.
- నల్లి, గులాబిపురుగుతో నష్టపోయిన మిర్చి, పత్తిరైతులతో ఫిబ్రవరి2న రచ్చబండ నిర్వహించబోతున్నాం.