- ప్రతి ఇంటికీ పథకాలు అందిస్తున్న ఘనత మాదే
- విప్లవాత్మక నిర్ణయాలతో వైఎస్ జగన్ అడుగులు
- అనంతలో రూ.800 కోట్లతో రోడ్ల నిర్మాణాలు
- సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం
- వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం
- ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
- రుద్రంపేట, 35వ డివిజన్లలలో గడప గడపకు మన ప్రభుత్వం
ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎదుర్కోలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఉదయం రుద్రంపేట పంచాయతీలో, సాయంత్రం 35వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎస్టిమేట్లు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన స్ఫూర్తితో ఇచ్చిన ప్రతి హామీని వైఎస్ జగన్ నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. ప్రజల్లో రోజురోజుకూ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక.. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అందరూ కలిసి వచ్చినా తమకు ఢోకా లేదన్నారు. జగన్ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. అనంతపురం నియోజకవర్గంలో 30 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందన్నారు. మూడున్నరేళ్లలో రూ.800 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. నాడు నేడు కింద ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఇలాంటి తరుణంలో ఓ వర్గం మీడియా రోజుకో అసత్య కథనాన్ని ప్రచురిస్తూ అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తోందని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తామన్నారు.కార్యక్రమాల్లో మేయర్ వసీం సలీమ్,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయభాస్కర్ రెడ్డి,జెడ్పిటిసి చంద్ర,ఎంపిపి వరలక్ష్మి, సర్పంచ్ పద్మావతి,వైస్ ఎంపిపి బాలాజీ,కార్పొరేటర్ కొండ్రెడ్డి రాధ,ఎంపిటిసిలు ప్రకాష్ ,మహబూబి,సచివాలయ కన్వీనర్లు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి,ఆలుమూరు శ్రీనివాస్ రెడ్డి,వివిధ కార్పొరేషన్ ల డైరెక్టర్లు,వైసీపీ అనుబంధ సంఘాల నాయకులు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.