రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం అని మరియు దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ప్రసంగంతో పార్లమెంట్ సెషన్స్‌ను ప్రారంభించారు.