పలు అంశాలపై టీడీపీ ఆందోళన.. వాడీవేడిగా నగర పాలక సంస్థ సమావేెశం
- ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లు, నీటి మీటర్ల ఏర్పాటుపై అధికార, విపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా.. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సమావేశం జరిగింది.
- పెన్షన్లు తొలగింపుపై కౌన్సిల్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
- పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేయడంతో వారిని బయటకు పంపారు.
- విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం టీడీపీ సభ్యుల ఆందోళనతో రసాభాసగా మారింది.
- అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య వాడీవేడిగా సాగింది.
- సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా హాజరయ్యారు.
- సమావేశం ప్రారంభం అవ్వగానే.. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్స్, నీటి మీటర్ల ఏర్పాటుపై టీడీపీ, సీపీఎం సభ్యులు వీఎంసీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు.
- పెన్షన్లు తొలగింపుపై కౌన్సిల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
- పెన్షన్లు ఇవ్వాలని.. రద్దు చేసిన వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
- గృహాలకు నీటి మీటర్ల ప్రతిపాదన విరమించుకోవాలన్నారు.
- పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, సీపీఎం సభ్యులను బయటకు పంపారు.
- కార్యాలయం బయట కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
- నగరపాలక సంస్థ బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలపై అధికార పార్టీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పలు ప్రతిపాదనలు చేశారు.
- ప్రతిపాదనలను పరిశీలిస్తామని మేయర్ తెలిపారు.
- నగరంలో చేపట్టాల్సిన రహదారులు, ఫుట్ పాత్ల నిర్మాణంపై బడ్జెట్లో ప్రతిపాదనలు వచ్చాయని మేయర్ తెలిపారు.