- సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
- తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.
- ఈ క్రమంలో తారకరత్నను చూసేందుకు సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ఆసుపత్రికి విచ్చేశారు.
- సినీ నటుడు నందమూరి తారకరత్న గత నాలుగు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
- తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ సినీ హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.
- ఈ క్రమంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ఆసుపత్రికి విచ్చేశారు.
తారకరత్నను చూసిన అనంతరం లక్ష్మీపతి మాట్లాడుతూ..
- తారకరత్నతో ఇంతకుముందే ఒక సినిమాను పూర్తి చేశానన్నారు.
- జనవరి 23వ తేదీ నుంచి ఆయనతో రెండవ సినిమా తీయడానికి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేశానని.. యువగళం పాదయాత్ర కారణంగా ఆయన ఫిబ్రవరి ఆరు తరువాత చిత్ర నిర్మాణం ప్రారంభించాలని తారకరత్న చెప్పినట్లు నిర్మాత తెలిపారు.
- ‘బి అలర్ట్’ అనే పేరుతో సినిమాను నిర్మించాల్సి ఉండగా.. ఇంతలోనే తారకరత్న అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు.
- ఆయన త్వరగా కోలుకుంటారని..త్వరలోనే సినిమాను కూడా చేస్తామని ఆయన అన్నారు.అనంతరం నిర్మాతల సంఘం సెక్రటరీ, తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
- తారకరత్న ఆరోగ్యం మెరుగు పడుతోందన్నారు.
- ప్రస్తుతం ఆయన కాళ్లు, చేతులు కదుపుతున్నారని తెలిపారు.
- తారకరత్న వంద శాతం ఆరోగ్యవంతుడు అవుతారని.. ప్రజలందరూ తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారన్నారు.