- టీడీపీ అధికారంలోకి వచ్చాక.. అరటి రైతులపై ప్రత్యేక దృష్టి
- నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అయిదో రోజు కొనసాగుతోంది.
- కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు.
- తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
- చిత్తూరు జిల్లా కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు.
- ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతోందని రైతులు లోకేశ్ ఎదుట వాపోయారు.
- ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగాయన్నారు.
- కిలోకు 15 రూపాయల ధర కూడా రావడం లేదన్నారు.
- సమస్యలు విన్న లోకేశ్.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు.
- పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఐదో రోజు ఉత్సాహంగా సాగుతోంది.
- కృష్ణాపురం టోల్‌గేట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కస్తూరి నగరం క్రాస్ వద్ద గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్నారు.
- కైగల్లు వద్ద యాదవ సామాజికవర్గం, మధ్యాహ్నం దేవదొడ్డి గ్రామంలో కురుమ సామాజికవర్గంతో భేటీ అయ్యారు.
- సాయంత్రం బైరెడ్డిపల్లెలో బీసీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గోన్నారు.