గతంలో కొత్తగా ఎవరైనా ఎంపీ ఎన్నికైతే.. మంచి వాతావరణంలో వాళ్లను మాట్లాడేందుకు అనుమతించి.. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఇప్పుడు రాష్ట్రపతి అలా ప్రసంగించబోతున్నారు. ఇది గిరిజనులకు ఎంతో గర్వకారణమైన రోజు అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే.. మన ఆర్థిక మంత్రి కూడా మహిళే ఉన్నారని, ఈ సారి బడ్జెట్‌కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధాని తెలిపారు. ప్రతీ పౌరుడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న ప్రధాని.. అంచనాలను అందుకునే యత్నిస్తామని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి అందుకు కారణమని ఆయన అన్నారు.