- జగన్ లా నేను దొంగ హామీలు ఇవ్వను… నెరవేర్చే హామీలే ఇస్తా
- లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు ఐదో రోజు – గ్రామాల్లో లోకేశ్ కు అపూర్వ నీరాజనాలు
- వివిధ వర్గాలను కలుస్తూ ఉత్సాహంగా సాగుతున్న లోకేశ్
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
- బైరెడ్డిపల్లిలో లోకేశ్ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
- ఈ సందర్భంగా వారు జగన్ పాలనలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని లోకేశ్ కు తెలిపారు.
- ఈ నేపథ్యంలో లోకేశ్ మాట్లాడుతూ…
- బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని అన్నారు.
- “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ. టీడీపీ హయాంలో 90 శాతం సబ్సిడీ తో రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చాం. మినీ గోకులంలు నిర్మించింది టీడీపీ” అని వివరించారు.
- కానీ జగన్ కురుబల గొంతు కోశాడని లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.
- రిజర్వేషన్లు కట్ చెయ్యడం వలన పెద్ద ఎత్తున కురుబలు నష్టపోయారని వెల్లడించారు.
- కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను ఏర్పాటు చేశారు కానీ, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని అన్నారు.
- 3 ఏళ్ల 8 నెలల్లో కురుబలకి ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని లోకేశ్ ఆరోపించారు.
- ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ పీకింది ఏంటి… కురుబలకి చేసింది ఏంటి? అని నిలదీశారు.
- “రిజర్వేషన్లు తగ్గించాం అని బీసీ శాఖ మంత్రి గారు స్వయంగా ఒప్పుకుంటున్నారు. కానీ 16 వేల పదవులు పోలేదు అంటున్నారు. మరి ఎన్ని పదవులు పోయాయో ఆయనే చెప్పాలి. కురుబలపై జగన్ పాలనలో దాడులు పెరిగాయి” అని తెలిపారు.
- చెత్త మీద పన్ను వేసినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా?
- కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా?
- బీసీ రిజర్వేషన్లు కట్ చేసినందుకు జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలా? అని ధ్వజమెత్తారు.
- తాను జగన్ లా దొంగ హామీలు ఇవ్వనని… నెరవేర్చే హామీలే ఇస్తాని నారా లోకేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
- ప్రభుత్వ ఖర్చులతో కనకదాసు జయంతి పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు.
- బీరప్ప ఆలయం అభివృద్ది, నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు.
- ఉపాధి హామీ అనుసంధానం ద్వారా మినీ గోకులంలు నిర్మిస్తామని తెలిపారు.
- కాగా, లోకేశ్ పాదయాత్రకు ఇవాళ 5వ రోజు కాగా, పలమనేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా హుషారుగా సాగింది.
- లోకేశ్ తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు.
- ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ లోకేశ్ ముందుకు సాగారు.
- లోకేశ్ కు గ్రామాల్లో మహిళలు దిష్టి తీశారు. తిలకం దిద్ది, హారతి పట్టారు.
- పలమనేరు నియోజకవర్గంలో వ్యవసాయ భూములను కూడా లోకేశ్ సందర్శించారు.
- అక్కడ సాగవుతున్న పంటలను పరిశీలించారు.
- పొలాల్లో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.