- వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని సవాల్ ను స్వీకరించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
- తన ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అనేందుకు గల ఆడియో ఆధారాన్ని బయటపెట్టిన కోటంరెడ్డి
- శ్రీధర్ రెడ్డి అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో రికార్డును బయటపెట్టి..ఇది ఎలా వచ్చిందో చెప్పాలంటూ ప్రశ్న
- రెండు ఐఫోన్లు మధ్య సంభాషణలు రికార్డు చేయడం వీలు కాదు అలాంటి రికార్డింగ్ అని చెప్పడం విడ్డూరం
- ఆడియోలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పడతారని చెప్పా.
- దానిని బాలినేని శ్రీనివాస్ కొట్టిపడేశారు..కనుకనే ఆడియోలు బయట పెడుతున్నా.
- ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు..9849966000 నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని రామాంజనేయులు నాతో చెప్పారు.
- ఆయన పంపినదే..నా మిత్రుడి తో మాట్లాడిన సంభాషణ..ఇది ట్యాపింగో..కాదో..మీ వ్యవస్థల ద్వారా తేల్చి చెప్పండి.
- ఈ ట్యాపింగ్ విషయాన్ని కేంద్ర హోంశాఖ,దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తా.
- ఒక శాసనసభ్యుడు ఫోన్ సంభాషణను దొంగచాటుగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది.
- ప్రభుత్వ పెద్దలే ఫోన్ టైపింగ్ చేస్తుంటే వారి దృష్టికి ఎలా పోతాం.
- అనుమానించిన చోట ఉండలేని కారణంగానే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను.
- నా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ విధానాన్ని నేను అనుసరించా.
- నేను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవక ముందు నుండే నా ఫోన్ ట్యాపింగ్ జరిగుతుంది.
- నా ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పెట్టాక..ఇద్దరు మంత్రులు,ఐదుమంది ఎంపి లు,30 మందికి పైగా ఎమ్మేల్యేలు కాల్ చేశారు.
- వాళ్ళ ఫోన్ లు టాప్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనే విషయాన్ని భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
- ట్యాపింగ్ విషయం తెలిసిన తరువాత మౌనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించాలి అనుకున్నా.
- మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి వీర విధేయుణ్ణి..ఇలాంటి నన్ను అనుమానపు చూపులు, అవమానాలకు గురి చేశారు.
- ఇద్దరు ఐపిఎస్ అధికారులలో మరొక పేరు మాత్రం నా ప్రాణం పోయినా బయట పెట్టాను.