- తేమశాతం పేరుతో జగన్ ప్రభుత్వం వరిరైతుల్ని దోచుకుంటోంది, గోదావరి జిల్లాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడానికి జగన్ అనాలోచిత నిర్ణయాలే కారణం- డాక్టర్ నిమ్మల రామానాయుడు (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు శాసనసభ పక్ష ఉపనేత)
- జగన్ రెడ్డి పాలన రైతులకు చీకటిరోజులే మిగిల్చింది.
- ధాన్యాగారంగా పిలువబడే రాష్ట్రం వ్యవసాయం చేయలేని పరిస్థితికి వచ్చింది.
- ధాన్యం పండించడంలో అగ్రస్థానంలో ఉండే గోదావరి జిల్లాల రైతులు వరిసాగుపై విముఖత చూపుతున్నారు.
- గోదావరి రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేకపాలనే కారణం.
- ప్రభుత్వం చెబుతున్న ఈక్రాప్ నమోదులో కౌలురైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
- కౌలురైతులకు గుర్తింపుకార్డులు లేకపోవడంతో, ఈక్రాప్ లో వారి వివరాలు నమోదు చేయడంలేదు.
- దాంతో వారు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటుధరకు అమ్ముకునే పరిస్థితిలేదు.
- రైతులు పండించిన ఉత్పత్తుల కొనుగోలుకు జగన్ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెడుతోంది.
- ఎక్కడ రూపాయి ఎక్కువస్తే, అక్కడ అమ్ముకునే వెసులుబాటు లేక రైతాంగం లబోదిబోమంటోంది.
- తేమశాతం పేరుతో ధాన్యం రైతుల్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోంది.
- ధాన్యం అమ్ముకోవడానికి రైతులు మిల్లర్లకు ఎదురు డబ్బులు కడుతున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం, కాలువలు, డ్రైన్లలో ఎలాంటి పూడికతీత పనులు చేయలేదు.
- టీడీపీప్రభుత్వం రైతులకు అందించిన మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ, యాంత్రీకరణ పరికరాల పంపిణీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా వంటి వాటిని జగన్ సర్కార్ అటకెక్కించింది.
- జగన్ తలతిక్క నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతోంది.