విశాఖపట్నం రాజధాని అన్న జగన్ ప్రకటన న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనే-కూన రవికుమార్ (మాజీ ప్రభుత్వ విప్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు).
విశాఖపట్నం రాజధాని అని జగన్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిం చడమే. రాజధానిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగా, ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి ఇష్టానుసారం ఎలామాట్లాడతాడు? జగన్ రెడ్డి ప్రకటనను న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనగా పరిగణించి, తక్షణమే విచారణ చేసి, చర్యలు తీసుకోవాలి.