- హిందుపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు అధికార పార్టీ, టీడీపీ కౌన్సిలర్ల వాదోపవాదనల మధ్య వాడివేడిగా జరిగింది.
- అభివృద్ధిపై ప్రశ్నించిన టీడీపీ.. వైకాపా మాటల దాడి
- అభివృద్ధిపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు మాటలతో దాడికి దిగారు.
- ఇంతకీ కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగిందంటే..
- శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశాలు ఉద్రిక్తత నడుమ కొనసాగాయి.
- పురపాలక పరిధిలోని అభివృద్ధిపై ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ కౌన్సిలర్లు మాటలతో దాడికి దిగారు.
- కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ పరిధిలో ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
- దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లపై మాటలతో దాడికి దిగారు.
- ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరగగా.. కౌన్సిల్ సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
- దీంతో కౌన్సిల్ సమావేశం హాల్లోకి పోలీసులు చేరుకున్నారు.
- వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు వచ్చారంటూ టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు.
- పోలీసుల అండతో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించటం సరైన పద్ధతి కాదంటూ.. టీడీపీ కౌన్సిలర్లు ఖండించారు.