- పంటలబీమా, రైతుభరోసా సాయం ఎంతమంది రైతులకు, ఎప్పుడు, ఎంతమొత్తం అందించారనే పూర్తివాస్తవాలతో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి- పత్తిపాటి పుల్లారావు
- చంద్రబాబుగారి సూచనతో టీడీపీరైతు విభాగం తరుపున స్టీరింగ్ కమిటీ సమావేశమైంది.
- అధికారపార్టీ రైతుల్ని దారుణంగా మోసగిస్తోంది. రైతుభరోసా కేంద్రాల ముసుగులో వంచిస్తోంది.
- రైతుభరోసా కేంద్రాల్ని ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది.
- వ్యవసాయశాఖను రాష్ట్ర రైతులు మర్చిపోయారు.
- ఇప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఉంది. మొక్కజొన్న రైతులు యూరియాకోసం గుంటూరులో రోడ్డెక్కారు.
- టీడీపీప్రభుత్వంలో యూరియాకొరత వస్తే, అప్పటికప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడి రైల్వే వ్యాగన్లద్వారా యూరియా రప్పించాము.
- మిర్చిరైతులు నల్లిపురుగుతో దారుణంగా నష్టపోయారు.
- చంద్రబాబు చిలకలూరిపేటలో రైతుల్ని పరామర్శించినప్పుడు ప్రభుత్వం హడావుడిగా నష్టపరిహారం ఇస్తామని ప్రకటన చేసింది. కానీ ఇప్పటికీ మిర్చి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు.
- మిర్చిరైతులు 4లక్షల ఎకరాల్లో పంటనష్టపోతే, అధికారులు ఇప్పటికీ లెక్కతేల్చలేదు.
- నల్లిపురుగు నివారణపై వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలతో ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్చలు జరపలేదు.
- గులాబి పురుగుతో అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారు.
- పంటలబీమా సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో, రైతులు పంటనష్టంతో తీవ్రంగా దెబ్బతిన్నారు.
అనంతపురంలో పంటలబీమా కింద రూ.2900కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పిన జగన్ రెడ్డి, ఎంత మొత్తం రైతులఖాతాల్లో జమచేశాడో చెప్పాలి. - మోటార్లకు మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రూ.6వేలకోట్లు కాజేయడానికి సిద్ధమయ్యాడు.
- రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేయడానికే ప్రభుత్వం వ్యవసాయమోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది.
- 64లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి, 49లక్షల మందికే ఇస్తున్నాడు. ఆ 49 లక్షల మందికైనా ప్రతిఏటా రైతుభరోసా సాయం వచ్చిందా అంటే అదీలేదు.
- జగన్ రెడ్డి ఇచ్చే రైతుసాయం ఒక్కోరైతుకి , ఒక్కోసంవత్సరంలో మాత్రమే వస్తుంది.
- ఏటా రూ.13,500 ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, కేవలం రూ.7,500తో సరిపెట్టాడు.
- ఒక్కో రైతు ఏటా రూ.6వేలచొప్పున నష్టపోయాడు. రాష్ట్రంలో 15లక్షల మంది కౌలురైతులుంటే, జగన్ రెడ్డి కేవలం 49వేలమందికే రైతుభరోసా సాయం అందించాడు
- రైతుభరోసా పంపిణీపై వాస్తవాలతో వైసీపీప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- రైతుభరోసా మాత్రమే కాదు, అన్నిపథకాల్లో ఇలానే జగన్ రెడ్డి ప్రజల్ని వంచిస్తున్నాడు
- అమూల్ ముసుగులో రాష్ట్రంలోని సహాకార డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే జగన్ రెడ్డి కుట్ర.
- పాడిరైతుల్ని ప్రలోభపెట్టి, బెదిరించి మరీ ప్రభుత్వం అమూల్ కు పాలుపోయించడం దుర్మార్గం.