- త్వరలో విశాఖపట్నంకు షిఫ్ట్ కాబోతున్నాం
- జగన్ సంచలన వ్యాఖ్యలు
- ఏపీ రాజధానిగా విశాఖ కాబోతోందని ప్రకటన
- ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
న్యూ ఢిల్లీ : త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖ కాబోతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ త్వరలోనే విశాఖ పట్నం ఏపీ కాపిటల్ కాబోతుందని సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని వివరించారు. పారిశ్రామికవేత్తలను విశాఖకు ఆహ్వానిస్తున్నామని, ఏపీ 12శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1 అన్నారు. స్థానంలో ఇక్కడ సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సిఎన్జిగా వివరించారు. కాగా, నిన్న ఏపీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే లాండింగ్ చేశారు. దీంతో ఏపీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం తప్పింది.